పేర్ని నాని కుటుంబ గోడౌన్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని పేర్ని నాని కుటుంబ గోడౌన్ లో మిస్సయిన బియ్యం లెక్క తేల్చారు అధికారులు. మొత్తం 7577 బస్తాలు బియ్యం మాయం అయినట్టు నిర్ధారణకు వచ్చారు అధికారులు. నెల రోజుల తర్వాత లెక్క తేల్చారు సివిల్ సప్లయి అధికారులు.
మొదట 3200 తర్వాత 4840 ఇపుడు ఫైనల్ గా 7577 బస్తాలు మిసైనట్టు నివేదిక అందించారు అధికారులు. గోడౌన్ లో బియ్యం తగ్గిందని గత నెల 26న లేఖ రాస్తే ఈ నెల 26కి ఎంత బియ్యం తగ్గాయనేది నిర్ధారించిన అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు అధికారులు ఇంకా పేర్ని నానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అటు ఇప్పటికే అజ్ఞాతంలో పేర్ని నాని ఫ్యామిలీ ఉన్న సంగతి తెలిసిందే. ఇక రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పై నేడు విచారణ చేయనుంది జిల్లా కోర్టు.