తెలంగాణ నుంచే తిరుమలకు ఆదాయం..కొండా సురేఖ సంచలనం !

-

 

 

తిరుమలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి తిరుమలకు అధిక భక్తులు, అధిక రాబడి వస్తుందని బాంబ్‌ పేల్చారు. శ్రీశైలం మల్లికకార్ణునస్వామి స్వామి దయతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ప్రభుత్వాలకు బలాన్ని, ధైర్యాన్ని, ఆర్థిక బలాన్ని ఇచ్చి నడిపించాలని వేడుకున్నా అంటూ మీడియాతో మాట్లాడారు. ఏపీ కలిసి ఉన్నప్పుడు శ్రీశైలం మా గుడిగా ఉండేది, దురదృష్టం రాష్ట్రం విడిపోవడం వలన శ్రీశైలాన్ని కోల్పోయాం.. అయిన మాకు మలన్నపై భక్తి ఎక్కువ అన్నారు.

konda surekha

ఏపీలో టీటీడీ నుంచి ఇబ్బంది ఉంది, తెలంగాణ భక్తులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు. గతంలో తిరుమలలో పద్ధతులు, నియమాలు ఉండేవి.. అలానే ఇప్పుడు కూడా తెలంగాణకు ఇవ్వాలని ఏపీ సీఎం కోరాం.. దానిపై కమిటీ వేశారని పేర్కొన్నారు. గతంలో తెలంగాణకు టీటీడీ నుండి కళ్యాణ మండపాలు ఆలయ అభివృద్ధికి నిధులు వచ్చేవి అలానే ఇప్పుడు కూడా రావాలని కోరుతున్నామన్నారు. తెలంగాణలో ప్రాచీనాలయాలు ఎక్కువగా గ్రామ గ్రామాన కళ్యాణ మండపాలు అడుగుతున్నారని తెలిపారు. టిటిడి ఒప్పుకొని ప్రత్యేకమైన నమ్మకాన్ని కలిగించి తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తున్నామన్నారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version