మొక్కజొన్నపొత్తులు మీరందరూ కాల్చకముందు చూసే ఉంటారు. దానిపై చాలా లేయర్స్ ఉంటాయి, ఇంకా పీచు కూడా వస్తుంది. బయట కంకె తీసుకుంటే ఈ గోల అంతా ఉండదు.. కానీ ఇంటికి మొక్కజొన్నపొత్తులు తెచ్చుకుని వాటిని మనమే తీయాలంటే..ఇళ్లంతా ఆ తొక్కలు పీచే అవుతాయి. వాటిని మనం సీదా తీసుకెళ్లి డెస్ట్‌బిన్లో వేస్తాం. కానీ మీరెప్పుడైనా అనుకున్నారా..ఈ పీచుతో కూడా చాలా ఉపయోగాలుంటాయని..వాడితే వృథాగా పోయేదేది లేదండోయ్.. ఆ పీచుతో టీ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలట..!
మొక్కజొన్న కండి మీద ఉండే పీచు ( కార్న్ సిల్క్ ) ని వివిధ దేశాలలో సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. అనేక వ్యాధుల నివారణకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు, మూత్రాశయ ఇన్ఫెక్షన్‌లు, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ వాపు వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ కార్న్ సిల్క్ రక్తప్రసరణ లోపాలు, గుండె వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు, అలసట, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ కార్న్ సిల్క్ నీటిని రోజూ తాగడం వలన కిడ్నీ పని తీరు మెరుగుపడుతుంది. మొక్కజొన్న కంకుల లాగా ఈ పట్టు కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో మొక్కజొన్న పట్టుతో టీ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యమైన అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
ఈ టీని తాగడం వల్ల రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలో కూడా ఈ టీ ఎంతగానో హెల్ప్ అవుతాయట. ఈ టీలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా ప్రసవానంతరం స్త్రీలు ఈ టీ ని తాగడం వల్ల రక్తస్రావం అధికంగా అవకుండా ఉంటుంది.
ఈ టీ ని ప్రతిరోజూ తాగుతూ ఉండడం వల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇంత చెప్పారు..మరి టీ ఎలా చేయడం అనేగా మీ డౌట్..
కార్న్ సిల్క్ టీ తయారీ : మొక్కజొన్న పీచుని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసుకుని మరిగించాలి. బాగా మరిగిన నీటిని ఫిల్టర్ చేసి నిమ్మరసం వేసుకుని.. వేడివేడిగా తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు తాగడం వలన శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి.
వీళ్లు వద్దు..
ఈ టీ ని చిన్న పిల్లలు, గర్భిణీలు, ఇతర వ్యాధులకు మందులు వాడే వారు మాత్రం తాగరాదు. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఈ టీ ని తాగరాదని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.