ప్రోటీన్ లోపం నుంచి బయటపడాలంటే శాకాహారులు వీటిని తీసుకోవడం మంచిది..!

-

చాలా శాతం మంది శరీరానికి తగిన ప్రోటీన్ ను అందించేందుకు చికెన్ ను ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా శారీరిక వ్యాయామాలను చేసేవారు ప్రతిరోజు ప్రోటీన్ కోసం చికెన్ ను తప్పకుండా తీసుకుంటారు. అయితే ప్రోటీన్ కోసం కేవలం చికెన్ మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా శాఖాహారులకు లేక చికెన్ ఇష్టపడని వారికి ప్రోటీన్ పుష్కలంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. కనుక వీటిని తప్పకుండా తీసుకోండి. దీనితో పూర్తి ఆరోగ్యాన్ని కుడా పొందవచ్చు. పైగా చికెన్ లో ఉండే ప్రోటీన్ కంటే ఎక్కువ ప్రోటీన్ అందించే ఆహార పదార్థాలను కూడా ఇవి అందిస్తాయి.

సోయాబీన్ లో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల సోయాబీన్ ను తీసుకోవడం వలన సుమారుగా 29 గ్రాముల ప్రోటీన్ ను పొందవచ్చు. సోయాబీన్ చికెన్ కు దాదాపుగా సమానమనే చెప్పవచ్చు. పైగా దీనిలో ఫైబర్, విటమిన్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. శాకాహారులు ప్రోటీన్ ను పొందడానికి పన్నీర్ ను ఎక్కువగా తీసుకుంటారు. 100 గ్రాముల పన్నీర్ ను తీసుకోవడం వలన శరీరానికి 40 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. నిజానికి చికెన్ లో ఉండే ప్రోటీన్ కంటే పన్నీర్ లో ప్రోటీన్ ఎక్కువ అనే చెప్పవచ్చు. పైగా పన్నీర్ లో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తుంది మరియు ఇది ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది.

అదేవిధంగా పెసరపప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పెసరపప్పును తీసుకోవడం వలన 24 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు. పైగా ఎన్నో విధాలుగా పెసరపప్పుతో ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రోటీన్ తో పాటుగా ఫైబర్, ఐరన్ మరియు ఎన్నో పోషకాలను కూడా పొందవచ్చు. ప్రోటీన్ కోసం శనగలు లేక శెనగపప్పును కూడా తీసుకోవచ్చు. 100 గ్రాముల శెనగపప్పును తీసుకోవడం వలన 25 గ్రాముల ప్రోటీన్ ను పొందవచ్చు. శెనగపప్పులో ప్రోటీన్ తో పాటుగా ఐరన్, ఫైబర్, ఫోలేట్ మరియు ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. కనుక చికెన్ కు బదులుగా ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఎలాంటి ప్రోటీన్ లోపం ఏర్పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version