వేప క్యాన్సర్ ని చంపేస్తుందా…?

-

పగటిపూట వేపచెట్టు కింద నిద్రించినవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు చెప్పిన మాట ఇది. వేప వలన చాలా మందికి ప్రయోజనాలు తెలియవు అనేది వాస్తవం. చేదుగా ఉంటుంది అంటూ షో చేస్తారు గాని వేప బెరడు, ఆకు, పువ్వు, పండు ఇలా అన్నీ ఎన్నో ఔషధాలకు వాడుతూ ఉంటారు. పళ్ళు తోముకుంటే దాని వలన ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.

కాని దాని గురించి తెలియక చాలా మంది లైట్ తీసుకుంటారు. తాజాగా హైదరాబాదీ శాస్త్రవేత్తలు కొన్ని విషయాలను తేల్చారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పరిశోధకులు కొన్ని సంచలన విషయాలు గుర్తించారు. వేపాకుల్లో, పువ్వుల్లో ఉండే నింబోలైడ్‌ అనే రసాయనం, పలు రకాల కేన్సర్‌ కణితులను తుత్తునీయలు చేస్తుందని తెలిపారు.

నింబోలైడ్‌కు కేన్సర్‌ను అంతమొందించే లక్షణాలు ఉన్నాయని 2014లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రసాయానాన్ని కేన్సర్‌ ఉన్న ఎలుకలకు నోటి ద్వారా అందించగా ఫలితం అందలేదని, అదే మందు రూపంలో నరాల్లోకి ఎక్కించి పరీక్షించగా కేన్సర్‌ కణితులు మాయమైనట్లు వాళ్ళు వివరించారు. దీన్ని మనుషుల్లోనూ పరీక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version