గర్భిణులు కాకరకాయ తినొచ్చా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!!

-

గర్భిణులకు ఆ తొమ్మిది నెలలు ఏది పెద్దగా తినాలనిపించదు. వాళ్లకు ఇష్టమైనవి తినకూడదు అంటారు. ఇష్టంలేనివి మంచివంటారు.. నీకోసం కాకపోయినా.. బిడ్డ కోసం అయినా తినాలి అని పెద్దోళ్లు చెప్తారు. కూరగాయలతో చేసిన వంటకాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కూరగాయాల్లో నెంబర్‌ కూరగాయ కాకరకాయ. ఇది అంటే మాములు వాళ్లకే నచ్చదు.. ఇంకా గర్భిణులు ఆ వికారంలో ఈ చేదును తినమంటే పాపం ఏడుపు ఒక్కటే తక్కువ.. అలా అని అస్సలు పక్కనపెట్టొద్దంటున్నారు నిపుణులు.

గర్భం ధరించాక కాకరకాయని తినడం చాలా మంచిది. ఇది తల్లికి బిడ్డకు చాలా మేలు చేస్తుంది. కనీసం రెండు రోజులకోసారైనా తినేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల మీ గర్భధారణ ప్రయాణం కూడా సులభతరం అవుతుంది. పండంటి బిడ్డ పుడుతుంది. కాకరకాయంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీకు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది. జంక్ ఫుడ్ తినడం నష్టమే కానీ లాభం లేదు. గర్భం ధరించాక మలబద్ధకం సమస్య చాలా మందిలో కలుగుతుంది.

హేమరాయిడ్స్ ప్రమాదం కూడా పెరుగుతుంది. మలబద్దకం రాకుండా అడ్డుకుని సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. కాకరకాయలో చరంటిన్ , పాలీపెప్టైడ్-పి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జెస్టేషనల్ డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ వచ్చినా కూడా పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం. చాలామంది గర్భధారణ సమయంలో డయబెటీస్‌ భారిన పడతారు. దీని వల్ల పుట్టే బిడ్డకు చాలా సమస్యలు వస్తాయి. అలాగే ఈ కూరగాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టిరియాతో పోరాడే శక్తిని ఇస్తుంది.

రోగినిరోధక శక్తిని పెంచుతుంది. అధ్యయనాల ప్రకారం కాకరకాయ పెరిస్టాల్సిస్‌ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది గర్భిణీ స్త్రీల ప్రేగు కదలిక, జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంటే తిన్నది చక్కగా అరుగుతుందన్నమాట. అజీర్తి లక్షణాలు రావు. గర్భిణులకు ఫొలేట్ చాలా అవసరం. కాకరకాయ తినడం వల్ల గర్భిణిలకు పుష్కలంగా ఫొలేట్ అందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version