ఆల్కహాల్‌ను తరచూ కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఆల్కహాల్‌ను పరిమితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని చెబుతోంది. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు మద్యం సేవిస్తే సమస్యలు వస్తాయా ? వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ? దీనిపై వైద్యులు ఏమంటున్నారు ? అంటే…
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు అయినా.. ఇతరులెవరైనా సరే.. మద్యాన్ని మోతాదులోనే తీసుకోవాలి. మోతాదుకు మించి మద్యం సేవిస్తే అందులో ఉండే క్యాలరీల వల్ల అధిక బరువు పెరుగుతారు. దీంతో స్థూలకాయం, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు అతిగా మద్యం సేవిస్తే షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. దీంతో షుగర్ లెవల్స్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే గుండె సమస్యలు వస్తాయి.
కనుక డయాబెటిస్ ఉన్నా, లేకపోయినా.. ఎవరైనా సరే ఆల్కహాల్‌ను తక్కువ మొత్తంలో తీసుకుంటే దాని వల్ల లాభాలను పొందవచ్చు. కానీ అతిగా సేవిస్తే అదే విషంగా మారుతుంది. అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.