ఒక్కొక్కసారి సడన్ గా మనకి ఎక్కిళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పోవు. ఎక్కిళ్లు కనుక ఆగకుండా వస్తున్నట్లయితే ఇలా ఈజీగా మీరు ఎక్కిళ్ళు ని ఆపుకోవచ్చు. ఎక్కిళ్లు ని తగ్గించడానికి ఈ చిట్కాలు బాగా హెల్ప్ అవుతాయి. ఎక్కిళ్ళు ఆగకుండా వచ్చినట్లయితే ఇలా చేయండి. తరచుగా ఎక్కిళ్ళు వస్తే కష్టంగా ఉంటుంది అలా ఎక్కువసేపు ఎక్కిళ్ళు వస్తే గోరువెచ్చని నీటిలో కొంచెం పుదీనా ఆకులు వేసి నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసుకుని ఈ నీటిని తాగితే వెంటనే తగ్గిపోతాయి.
శొంఠి, కరక్కాయ పొడిని మిక్స్ చేసి ఒక చెంచా పొడి ని నీటి లో కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళ నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఆగకుండా అలా ఎక్కిళ్ళు వస్తున్నట్లయితే నిమ్మకాయ ముక్కని వాసన చూడండి. ఇలా చేయడం వలన కూడా ఎక్కిళ్లు త్వరగా తగ్గిపోతాయి. యాలుకల నీళ్లు తాగితే కూడా రెండే నిమిషాల్లో ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
ఎక్కిళ్ళు తగ్గాలంటే చిటికెడు ఇంగువ పొడిని అర టీ స్పూన్ వెన్న తో పాటు తీసుకుంటే ఎక్కిళ్ళు వెంటనే మాయమైపోతాయి. ఎక్కిళ్ళు ఆస్తమాను వస్తున్నట్లయితే కొంచెం తేనె తీసుకుంటూ ఉండండి. ఇలా ఈ టిప్స్ తో ఎక్కిళ్ల సమస్య నుండి బయట పడొచ్చు. ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు ని ట్రై చేయండి ఇక బాధ ఉండదు.