దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే పోషకాలు బాడీకీ బాగా మేలు చేస్తాయి. సమ్మర్ లో బాడీ బాగా డీహైడ్రేట్ అవుతుంది. వాటర్ ఎక్కువ తాగితే.. పొట్ట ఉబ్బినట్లు అవుతుంది. కానీ తాగాలి అనే తపన వల్ల కొన్ని సార్లు ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు దోసకాయ, కొత్తిమీర కాంబినేషన్ తో జ్యూస్ చేసుకుని తాగితే చాలా ఉపశమనం ఉంటుంది అట. ఇందులో విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ మొదలైన పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ జ్యూస్ బరువు తగ్గాలనుకునేవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఏం లాభాలు ఉన్నాయో చూద్దామా..!
దోసకాయ, కొత్తిమీరతో తయారు చేసిన జ్యూస్ ఉదయం లేదా మధ్యాహ్నం తాగాలి. ఇంకా బయటకు వెళ్లేముందు కూడా ఇది ఒక గ్లాస్ జ్యూస్ తాగి వెళ్తే.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. తరచూ దాహం వేయకుండా ఉంటుంది.
బరువు తగ్గాలనుకుంటే క్రమం తప్పకుండా దోసకాయ, కొత్తిమీరతో తయారు చేసిన జ్యూస్‌ని తాగొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి పోషకాల కొరత ఏర్పడదు. సులువుగా బరువు తగ్గుతారు. ఇది మైకం, లో బీపీ వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం ఇస్తుందట.
వేసవిలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలంటే నీరు ఎక్కువగా ఉండేవి తినాలి. అలా అని నీరు తాగలేం కదా.. అందుకే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను తీసుకుంటే స్కిన్ కూడా బాగుంటుంది.. దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఈ కారణంగా దీని వినియోగం చర్మానికి మేలు చేస్తుంది. దోసకాయ, కొత్తిమీర జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది.
కాబట్టి.. ఈ సమ్మర్ లో ఎప్పుడైనా అధిక దాహం సమస్యతో ఇబ్బంది పడితే.. ఈ జ్యూస్ చేసుకుని తాగండి. ఈ రెండు నెలలు ఇంట్లో దోసకాయను ఉంచుకోవడం మాత్రం మర్చిపోకండే.. దోసకాయతో జ్యూస్ మాత్రమే కాదు.. ఉదయం, సాయంత్రం అట్లా.. టైం పాస్ కు కూడా తినొచ్చు. దీని వల్ల జీర్ణసంబంధమైన సమస్యలు కూడా ఉండవు.
-Triveni Buskarowthu