ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అయితే పండ్లని కొన్ని పండ్లతో పాటు తీసుకోకూడదు. బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఉంటాయి. అలాగే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. బొప్పాయి పండ్లను ఎట్టి పరిస్థితుల్లో వీటితో తీసుకోవద్దు. వీటితో తీసుకున్నట్లయితే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బొప్పాయి, నిమ్మకాయ
బొప్పాయిని నిమ్మకాయతో కలిపి తీసుకోవడం వలన అసిడిటీ సమస్య వస్తుంది. ఈ కాంబినేషన్ శరీరంలో సహజంగా జరిగే రసాయనిక చర్యలని దెబ్బతీయడంతో కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటివి వస్తాయి.
బొప్పాయి, అరటిపండు
ఈ రెండు పండ్లను కూడా కలిపి తీసుకోకూడదు. ఈ రెండు కలిపి ఒకేసారి తీసుకోవడం వలన కడుపులో ఇబ్బందులు వస్తాయి అజీర్తి సమస్య కలుగుతుంది. అలాగే మానసిక స్థితిని కూడా ఇది ప్రభావం చేస్తుంది.
బొప్పాయి, పెరుగు
ఈ రెండిటిని కూడా కలిపి తీసుకోకూడదు. జీర్ణ సమస్యలతో పాటుగా కడుపులో అసౌకర్యం కలుగుతుంది. శరీరానికి సమర్థవంతంగా పోషకాలు అందవు.
బొప్పాయి, క్యారెట్
ఈ రెండిటిని కూడా కలిపి తీసుకోవద్దు. గుండెకి ఇది హాని చేస్తుంది. ఈ రెండు పదార్థాలు ఒకేసారి తీసుకోవడం వలన రక్తం స్థాయిలో కూడా హెచ్చుతగ్గులు కలుగుతాయి.
బొప్పాయి, ద్రాక్ష
వీటిని కూడా కలిపి తీసుకోకూడదు. జీర్ణక్రియని కష్టతరం చేయడమే కాకుండా అనేక ఉదర సంబంధిత సమస్యల్ని కలిగిస్తుంది. బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే. ఈ పండుని విడిగా మాత్రమే తీసుకోండి. ముఖ్యంగా ఈ కాంబినేషన్స్ లో తీసుకోవద్దు