నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే మన్మోహన్ సింగ్ పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. అక్కడ మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఏఐసీసీ కార్యాలయానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, చిదంబరం, అజయ్ మాకెన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు.
ముందుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మన్మోహన్ మృతదేహానికి నివాళ్లు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ లీడర్లు సైతం మాజీ ప్రధాని పార్థివదేహానికి అంతిమ నివాళ్లు అర్పించారు. శనివారం సాయంత్రం అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు జరగనున్నాయి.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు తుది వీడ్కోలు పలికేందుకు ఎఐసిసి కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, చిదంబరం, అజయ్ మాకెన్, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సిఎం డికే శివకుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు, సర్వే… pic.twitter.com/mxDGZzanr5
— ChotaNews (@ChotaNewsTelugu) December 28, 2024