వైవాహిక జీవితం స్ట్రాంగ్‌ అవ్వాలంటే… వారానికి ఎన్నిసార్లు శృంగారం చేయాలో తెలుసా..?

-

శృంగారం..ఈ సబ్జెక్ట్‌ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కవే..ఒక వ్యక్తి జీవితం ఎంత సంతోషంగా ఉంది అనేది వారి భాగస్వామితో చేసే శృంగారంతోనే తెలిసిపోతుంది. అసలు వైవాహిక జీవితంలో సెక్స్‌ చాలా ముఖ్యమైనది.. ఇది చెప్పడానికి, వినడానికి విడ్డూరంగా ఉన్నా నిజం.. మీ ఇద్దరి మధ్య బందాన్ని బలపరిచే ఒక వంతెన లాంటిది. ఇద్దరిలో ఒకరు శారీరకంగా సంతృప్తి చెందకపోతే బంధంలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శృంగారం విషయానికి వస్తే, చాలా మంది జంటలు తమ భాగస్వామికి దాని గురించి చెప్పడానికి వెనకాడతారు. ఇద్దరు వ్యక్తులు శృంగారం తమ డిమాండ్లు, సంతృప్తి గురించి బహిరంగంగా మాట్లాడుకుంటే దంపతుల మధ్య అనుబంధం చాలా బాగుంటుందని సెక్స్ నిపుణులు అంటున్నారు. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే వారానికి ఎన్నిసార్లు సెక్స్ చేయాలి.

ఉద్యోగ రీత్యా ఎక్కువ దూరం వెళ్లే జంటలకు సెక్స్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది..అలా అని ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా ఉండదు.. ఓ అధ్యయనం ప్రకారం.. చాలా మంది జంటలు సంవత్సరానికి దాదాపు 54 సార్లు సెక్స్‌లో పాల్గొంటారట. ఇలా చూస్తే వారానికోసారి ఒకసారి.. సెక్స్ లో పాల్గొంటారని అర్థమవుతోంది. ఈ అధ్యయనం యునైటెడ్ స్టేట్స్‌లో 40 సంవత్సరాల పాటు మూడు వేర్వేరు ప్రాజెక్టులలో నిర్వహించారు. వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసే జంటలు చాలా సంతోషంగా ఉంటారని… నెలకు ఒకసారి లేదా చాలా తక్కువ సెక్స్‌లో పాల్గొనే వారు అసంతృప్తికి గురవుతారని నివేదికలో పేర్కొన్నారు..

గొడవలు పడుతున్న జంటల మధ్య లైంగిక సంతృప్తి ఉండదు.. లైంగిక సంతృప్తికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇద్దరు వ్యక్తులు మనసు విప్పి తమ భావాలను, డిమాండ్లను పంచుకోవాలి. అప్పుడే మీరు లైంగిక సంతృప్తిని పొందవచ్చు. అరేంజ్‌ మ్యారెజ్‌లో ఇది కాస్త కష్టమైన పనే.. కానీ ఇద్దరి మైండ్‌ సెట్‌ ఒకేలా ఉంటే.. త్వరగా కలిసిపోవచ్చు..

ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనయ్యే వ్యక్తులు సెక్స్ పట్ల ఆసక్తి చూపరు. వారి ఆసక్తి మందు, సిగిరెట్‌ మీదే ఉంటుంది.. వారు సెక్స్ పట్ల లేదా తమ భాగస్వామి భావాలపై ఆసక్తి చూపించరు. ఇది భాగస్వామిలో లైంగిక అసంతృప్తిని కలిగిస్తుంది.

చాలా వివాహాల్లో చీలికలకు మొబైల్ కూడా ఒక కారణం. భాగస్వామి మొబైల్ ఫోన్‌ లో ఎక్కువ సమయం గడిపినట్లయితే, దంపతుల మధ్య కమ్యూనికేషన్ తగ్గుతుంది. ఇది అసంతృప్తిని కలిగిస్తుంది. బెడ్‌రూమ్‌లో టీవీ ఉంటే, పడుకునే ముందు దాన్ని ఆఫ్ చేయాలని నియమం పెట్టుకోండి. మీరిద్దరూ మీ మొబైల్‌ని దూరంగా ఉంచి, మాట్లాడుకోండి. దీంతో ఇద్దరి మధ్య రొమాన్స్ పెరుగుతుంది.

కొంతమంది తమ శరీరాల గురించి ఆలోచిస్తారు. దీని వల్ల తన శరీరాన్ని చూసి భాగస్వామి ఏమనుకుంటారోనని భయపడి సెక్స్‌లో పాల్గొనడానికి వెనుకాడతారట. ఈ రకమైన సమస్య ఉన్నవారు సైకియాట్రిస్ట్, సెక్సాలజిస్ట్‌ను కంన్సల్ట్‌ అవడం ఉత్తమం.. దానికి ముందు మీ భాగస్వామితో మాట్లాడండి. వారి మాటలు మీ విశ్వాసాన్ని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకున్న మందులు లైంగిక ఆసక్తిని తగ్గిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version