ఫ్యామిలీ అంతా ఒకే సోప్‌ వాడుతున్నారా..? ఒకరి సబ్బును మరొకరు వాడొచ్చా..?

-

స్నానం చేయడానికి ఏదో ఒక సోప్‌ను ఎంచుకోవాలి. కానీ అది మన స్కిన్‌ టోన్‌ను బట్టి మీ చర్మానికి ఏది సెట్‌ అవుతుందో చూసుకుని ఎంచుకోవాలి. పొడిచర్మం ఉన్నవారికి, జిడ్డు చర్మం ఉన్నవారికి ఒకే రకమైన సబ్బు సెట్‌ కాదు. ఇకపోతే.. చాలామంది ఇళ్లలో ఒకటే సోప్‌ను మొత్తం ఫ్యామిలీ అంతా వాడేస్తుంటారు. మనం చిన్నప్పుడు కూడా ఇలానే చేసి ఉంటాం కదా.. కానీ కాలం మారేకొద్ది మనకోసం స్పెషల్‌ సోప్‌ను ఎంచుకున్నాం. కానీ కొంతమంది ఇంకా అదే పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు. ఇలా ఒకటే సోప్‌ను ఫ్యామిలీ అంతా వాడితే వచ్చే నష్టం ఏంటో చూద్దామా..!

ఇత‌రుల స‌బ్బుల‌ను ఉప‌యోగించి స్నానం చేయ‌కూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒకే స‌బ్బుతో ఇంట్లో అంద‌రూ స్నానం చేయ‌కూడ‌ద‌ని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే స‌బ్బుపై 5 ర‌కాల సూక్ష్మ‌క్రిములు ఉండే అవ‌కాశం ఉంటాయి. అలాగే ఈ క్రిములు ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించే అవ‌కాశం ఉంది. స‌బ్బుపై ఇకోలి, సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరో వైర‌స్, స్టాఫ్, రోటా వైర‌స్ వంటి క్రిములు, వైర‌స్‌లు ఉండే అవ‌కాశం ఉంది. ఇవి చ‌ర్మంపై ప‌డిన గాయాలు, దెబ్బ‌లు అలాగే మ‌లం ద్వారా వ్యాపిస్తాయి. అయితే నిపుణులు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్తున్నారు. సబ్బుపై క్రిములు ఉన్న‌ప్ప‌టికి అవి ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెందిన‌ప్ప‌టికి వ్యాధులు మాత్రం వ్యాప్తి చెంద‌కుండా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు. వ్యాధులు వ్యాప్తి చెంద‌కుండా ఉన్న‌ప్ప‌టికి ఒక ఇన్ఫెక్ష‌న్ మాత్రం వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ట.

యాంటీ బ‌యాటిక్ రెసిస్టెంట్ స్టాఫ్ ఇన్ఫెక్ష‌న్ అయిన మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాక‌స్ ఆరియ‌స్ అనే అంటువ్యాధి వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు. ఒక‌రి స‌బ్బుల‌ను మ‌రొక‌రు ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే మంచిది. బాడీ వాష్ ల‌ను, లిక్విడ్ సోప్ ల‌ను ఇత‌రుల‌వైన వాడుకోచ్చు. అలాగే ఒకే స‌బ్బును ఇంట్లో అంద‌రూ పంచుకున్న‌ట్ట‌యితే స‌బ్బును వాడే ముందు శుభ్రంగా క‌డుక్కోవాలి. అలాగే స‌బ్బుపై ఎక్కువ నురుగు ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా స‌బ్బు ఎల్ల‌ప్పుడూ పొడిగా ఉండేలా చేసుకోవాలి. స‌బ్బును పొడిగా ఉంచ‌డం వ‌ల్ల బ్యాక్టీరియా వృద్ది చెందే అవ‌కాశం ఉంది. స‌బ్బును ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. మ‌నం ఇత‌రుల స‌బ్బును వాడ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఎవ‌రి స‌బ్బును వారు ఉప‌యోగించ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. అందరూ కలిసి ఒకే సబ్బు వాడినా, ఎవరి సోప్‌ వాళ్లు వాడినా అదే ఖర్చు అవుతుంది. కాకపోతే ముందే కొనాల్సి ఉంటుంది అంతే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version