రేపు HYDలో లేక్‌ ఫ్రంట్‌ పార్కు ప్రారంభం

-

హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహానగరంలో మరో పర్యాటక క్షేత్రం ప్రారంభం కానుంది. హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మించిన లేఖ్ ఫ్రంట్ పార్క్ ను రేపు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పార్కును హెచ్ఎండిఏ సుమారు 26 కోట్లతో పది ఎకరాలలో నిర్మించింది. మరోవైపు మూసి మరియు ఈశా నదులపై వంతలను నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ఇవ్వాలా శంకుస్థాపన చేయనున్నారు.

మొదటగా మూసీ నదిపై నిర్మించే వంతెనలకు శంకుస్థాపన చేయనున్నారు. పీర్జాదిగూడలో మూసీపై నిర్మించే వంతెనకు, ఉప్పల్ శిల్పారామం వద్ద, మూసారాంబాగ్‌లో మూసీ నదిపై నిర్మించే వంతెనకు శంకుస్థాపన చేస్తారు.ఆ తర్వాత దుర్గం చెరువు వద్ద ఎస్టీపీని, మ్యూజికల్ ఫౌంటెన్‌ను మంత్రి కేటీఆర్​ ప్రారంభించనున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నన్ని రోజులు హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని.. కేసీఆర్ సారథ్యంలోనే భాగ్యనగరం విశ్వనగంరా పేరుగాంచుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు 168 కోట్ల రూపాయల వ్యయంతో 5 వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండీఏ ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రోక్యూర్మెంట్, కన్​స్ట్రక్షన్ పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version