చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. నిజానికి ఉపవాసం వల్ల పుణ్యం ఏ కాదు ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మన పూర్వికులు కూడా ఉపవాసాన్ని చేస్తూ ఉండేవారు. ఏదైనా మంచి రోజులు వచ్చినా ఏకాదశి వంటివి వచ్చినా ఉపవాసంని చేస్తూ ఉండేవారు.
ఉపవాసం నాడు కేవలం ప్రసాదాన్ని తీసుకుంటూ మిగిలిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండేవారు. ముఖ్యంగా ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి తీసుకునేవారు కాదు. అయితే ఉపవాసం చేయడం వల్ల పుణ్యం మాత్రమే కాకుండా మరి కొన్ని లాభాలను కూడా మనం పొందొచ్చు. అయితే మరి ఎలాంటి లాభాలను పొందొచ్చు అనేది చూద్దాం.
ఆహారం జీర్ణించుకునే శక్తి పెరుగుతుంది;
కాసేపు మనం ఏ ఆహార పదార్థాలను తీసుకోకుండా వాటికి దూరంగా ఉండటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఒంట్లో ఉండే చెడు పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. కిడ్నీలో రాళ్లు తొలగిపోవడానికి టాక్సిన్స్ బయటకు రావడానికి కూడా ఉపవాసం సహాయపడుతుంది. లివర్ కి విశ్రాంతి కూడా దొరుకుతుంది.
కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది:
ఉపవాసం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి అవుతుంది స్టడీ కూడా ఈ విషయాన్ని చెబుతోంది.
బరువు తగ్గొచ్చు:
చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఉపవాసం చేస్తే పుణ్యం కలుగుతుంది. విషపదార్థాల బాధ ఉండదు. ఉపవాసంను ఆచరించడం వల్ల ఒంట్లో చెడు పదార్థాలు తొలగిపోతుంది. కాబట్టి ఆ బాధ కూడా ఉండదు ఇలా ఉపవాసం ద్వారా ఇన్ని లాభాలు మనం పొందేందుకు అవుతుంది.