తరచుగా జ్వరం వస్తుందా.. అది HIV ప్రాథమిక లక్షణం కావొచ్చు

-

ప్రస్తుతం మనం అంతా కరోనాతో పొరాడుతున్నాం..ఒకవిధంగా దాంతో సహజీవనం చేస్తున్నాం..ఈ మధ్యకాలంలో ఎక్కడు చూసినా..ఏ న్యూస్ ఛానల్ పెట్టిన కరోనా అంతే..అందరి దృష్టిదానిపైనే ఉంది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టిదంటే మళ్లీ ఇప్పుడు కొత్తరకం వైరస్ ఒకటి వస్తుందట. వీటన్నింటి కంటే ముందే హెచ్ఐవీ వచ్చింది. ఈ మధ్యకాలంలో ‌ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోకవటం లేదు. చికిత్సలేని వైరస్ ఇది. ఈ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే ఉత్తమ మార్గం. ఈ మధ్య జ్వరం వస్తే కరోనానే అనుకుంటున్నారు.. తప్ప హెచ్ఐవీలోని ప్రాథమిక లక్షణం కూడా ఇదే అనే విషయాన్ని దాదాపు అందరూ మర్చిపోయారు. తరచూ జ్వరం రావటం ఈ వైరస్ లక్షణమట.

దేశంలోని ప్రజలలో HIV నివారణ గురించి అవగాహన చాలా పెరిగింది కానీ ఇప్పటికీ దాని ప్రారంభదశలో వచ్చే లక్షణాల గురించి చాలా మందికి తెలియదు. తరచుగా జ్వరం రావడం, నిత్యం ఆయాసంతో కూడిన సమస్య ఉండడం హెచ్‌ఐవీ లక్షణం కావచ్చని వైద్యులు అంటున్నారు. ఈ పరిస్థితి ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవడం చాలా ఉత్తమం.

ఈ వైరస్ శరీర రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. తద్వారా ఆ శరీరంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఒక వ్యక్తి HIV నివారణకు చికిత్స ప్రారంభించకపోతే కొంతకాలం తర్వాత AIDSకి దారితీస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగికి ఏదైనా వ్యాధి ఉంటే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

ప్రాథమిక లక్షణాలు ఇవి..

తరచుగా జ్వరం, నిరంతర తలనొప్పి, అలసటగా అనిపించడం,
ఆకస్మికంగా బరువు తగ్గడం, కీళ్ల నొప్పులు, విపరీతమైన చెమట,
నోటిలో తెల్లగా మారడం, హెచ్‌ఐవి ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు.
మచ్చలు, న్యుమోనియా, క్షయ, అతిసారం కూడా ఈ వైరస్ లక్షణాల్లో చేర్చారు.

ఇవి కాకుండా ఒక వ్యక్తికి గాయం మానకుండా ఉంటే దీంతో పాటు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుంటే తప్పకుండా.. HIV పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.

ఇలా రక్షించుకుందాం..

ఈరోజు వరకు ఎయిడ్స్‌కు సరైన చికిత్స అందుబాటులో లేదు. ఈ విషయం మనకూ తెలుసు.. కాబట్టి..
అసురక్షిత సంబంధాలను నివారించాలి.
రక్తం తీసుకునే ముందు వైద్యులచే పరీక్షించాలి.
ఇంజెక్షన్లు ఇచ్చేటప్పుడు డిస్పోజబుల్ సిరంజిలు, సూదులు మాత్రమే ఉపయోగించాలి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో హెచ్‌ఐవి సోకిన రోగుల సంఖ్య దాదాపు 24 లక్షలు మంది ఉన్నారు.. గత 9 ఏళ్లలో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య 37 శాతం తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version