గరంమసాలాలు ఎందుకు ఘాటుగా ఉంటాయి? వీటితో కేన్సర్‌…

-

మసాల లేకుండా ఏ నాన్ వెజ్ వంటకూడా చేయలేము కదా. అసలు భారతీయ వంటకాల్లో మసాల వాడే సంప్రదాయం ఈనాటిదికాదు. ఏ వంటలో అయినా చిటికెడు మసాల పొడివేస్తే చాలు మంచిగుమగుమలాడే వాసన వచ్చేస్తుంది. గరం గరం వంటల్లో గరంమసాల పడాల్సిందే. అసలు ఈ మసాలను గరం అని ఎందుకు అంటారు. మసాలాలు ఎక్కువ తింటే శరీరానికి వేడిచేస్తుందని కొందరి సందేహం. మూడు నుంచి పదిహేను రకాల మసాలాలతో గరం మసాలాలు తయారు చేస్తారు. సాధారణంగా చిన్న యాలకులు, జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, జాజికాయ మొదలైనవి గరం మసాలల్లో ముఖ్యంగా ఉంటాయి.

మసాల వల్ల ఆరోగ్యానికి మేలే చేకూరుతుంది.. ప్రతి మసాలా వివిధ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. అదనంగా ఎండు మిరపకాయలు, నూనెతో చేసే వంటకాల్లో గరం మసాలాలు జోడించడం వల్ల హానికరమైన ప్రభావాలను బాగా తగ్గిస్తుంది. అయితే, ఒక విషయం గుర్తుంచుకోవాలి. గరం మసాలాలలను.. వండిన తర్వాత ఆహారం మీద కొద్దిగా మాత్రమే జల్లుకోవాలి. వంట మధ్యలో వేసుకుంటే ఫుడ్ టేస్ట్ మారిపోయే అవకాశం లేకపోలేదు.

ఆయుర్వేదం ప్రకారం గరం మసాలాలు శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడతాయి. కాబట్టే ఈ మసాలా పేరులో గరం అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఇది అదనపు రుచిని జోడించడానికి, రుచిని మెరుగుపరచడానికి అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటాం.

జీలకర్ర , పెద్ద యాలకులు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు కలిపి ఇంట్లోనే గరం మసాలా పొడిని చాలామంది గృహిణులు చేసుకుని పెట్టుకుంటారు. జాజికాయను చిన్న ముక్కలుగా చేసి పౌడర్‌ తయారు చేసుకోవాలి. పొట్టును వేరు చేయడానికి జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలను గాలి చొరబడని సీసాలో వేసుకోని భద్రపరుచుకోవాలి.

రోజువారీ ఆహారంలో వేడి మసాలాలతో పాటు పసుపును ఉంచండి. వయస్సు వల్ల వచ్చే వివిధ వ్యాధులను నయం చేయడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. పసుపు కేన్సర్‌ కణాలను తొలగించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఆయువును కూడా పెంచుతుంది. పసుపు గుండెకు కూడా చాలా మంచిది అని వైద్యులు అంటున్నారు. డైలీ పాలల్లో పసుపు వేసుకుని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలతో పాటు, అందమైన చర్మం కూడా మీ సొంతం.

Read more RELATED
Recommended to you

Exit mobile version