నోటి దుర్వాసన నుండి హృదయ సంబంధిత సమస్యల వరకూ అనేక లాభాలు ఇలా పొందండి…

-

ఎండు ద్రాక్ష వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. మరి వాటి కోసం ఇప్పుడే చూసేద్దాం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే…

అజీర్తి సమస్యలు:

కాన్స్టిపేషన్ సమస్య తొలగిపోతుంది. దీనికోసం మీరు 5 నుండి 7 ఎండుద్రాక్ష తీసి గ్లాసు పాలలో నానబెట్టాలి. రాత్రి పూట ఇలా దీనిని తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతీ రోజు తీసుకోండి ఆ తర్వాత మీకే ప్రయోజనాలు కనపడతాయి. అదే విధంగా కడుపు నొప్పి తో పాటు గా కడుపులో ఉండే సమస్యలు కూడా దూరం అయిపోతాయి.

ముఖం మీద ముడతలు తొలగిపోతాయి:

ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ముడతలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. 10 నుండి 12 ఎండు ద్రాక్ష తీసుకుని పేస్టులాగా చేసి దానిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా మసాజ్ చేసి గోరు వెచ్చని నీటితో కడగడం వల్ల ముడతలు పోతాయి.

హృదయ ఆరోగ్యానికి మంచిది:

ఎండు ద్రాక్ష లో పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీని కంట్రోల్ చేస్తుంది. అలానే కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. ఇలా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎముకలకు ఉపయోగం:

ఎండు ద్రాక్ష లో క్యాల్షియం ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి కాబట్టి ప్రతి రోజూ వీటిని తీసుకోండి.

నోటి దుర్వాసన:

నోటి దుర్వాసన పోవాలంటే పది ఎండు ద్రాక్షను తీసుకుని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఆ ఎండు ద్రాక్షని నీళ్లలో వేసి మరిగించి తీసుకోవడం. దీని వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది అలాగే బరువు తగ్గడానికి కంటి ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version