షుగర్ పేషంట్స్‌కు ఏది తినాలన్నా పెద్ద పంచాయితీ.. ఏం తింటే..ఎక్కడ షుగర్ లెవల్స్ పెరిగిపోతుందేమో అని భయం. తెలిసి తెలియక ఒక ముద్ద ఎక్కువ తింటే..ట్యాబ్లెట్ ఒకటి ఎక్కువ వేసుకోవాల్సిందే.! చాలామంది డయబెటీస్ తమ జీవితాన్ని ఈ కన్ఫూజన్తోనే బతికేస్తున్నారు. డాక్టర్లు చెప్పేవి కొన్నే అయినా..సోషల్ మీడియా చాలానే నేర్పిస్తుంది. అందులో వాస్తవాలు అయితే లేకుండా ఉండవనుకోండి.! షుగర్ పేషంట్స్‌కు అంజీరా పండు చాలా మేలు చేస్తుందట. ఇది డైలీ తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయంటున్నారు నిపుణులు.
అంజీర్ పండులో అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, జింక్, మాంగనీస్, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంజీర పండ్లను తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు, అధిక చక్కెర ఉన్నవారు అంజీర్ పండ్లను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది..
అంజీర్‌లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ డ్రై ఫ్రూట్‌ను తీసుకుంటే రోగ నిరోధక శక్తి బలపడి రోగాలకు దూరంగా ఉంటారు. అంజీర్ పండ్లలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను త్వరగా గ్రహించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల షుగర్ పేషెంట్లకు ఎలాంటి హానీ ఉండదు.
అంజీర పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం పుష్కలంగా ఉండే అంజీర్ రక్తపోటును నియంత్రిస్తుంది. దీని వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అత్తి పండ్లలో ఉండే కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. దీన్ని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫినాల్, ఒమేగా 3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఎండిన అత్తి పండ్లలో ఉంటాయి.
అధిక బరువు ఉన్నవారు ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది..ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. ఈ పండు తిన్నాక ఎక్కువ సేపు తినాలనే కోరిక ఉండదు.
అంజీరా పండును రాత్రి నానపెట్టుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే మంచి ఫలితం ఉంటుంది. డ్రైఫ్రూట్స్ ఏమైనా సరే నానపెట్టుకుని తింటే వాటి ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. కాస్ట్ ఎక్కువైనా సరే..ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు కదా..!