మన ఆహారంలో రుచి కోసం మనము ఉపయోగించే ముఖ్యమైన పదార్థం ఉప్పు. ఇది రుచిని పెంచడమే కాక శరీరంలో ద్రవాలను సమానంగా కాపాడుతుంది. ఉప్పు లేకపోతే ఆహారం రుచి పుట్టదు. కానీ కొంతమంది రుచికి తగినంత ఉప్పు కన్నా ఎక్కువ మోతాదులో ఉప్పుని వాడతారు. అతిగా ఒప్పు తీసుకోవడం ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు..తెలుసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం..
ఉప్పు మితంగా తీసుకున్నంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అదే ఉప్పు సోడియం క్లోరైడ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని పెంచి హైపర్ టెన్షన్ కు దారితీస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెంచుతుంది.అధిక సోడియం గుండెపై ఒత్తిడి పెంచి గుండె గోడలను మందం చేస్తుంది. ఇది గుండె బలహీనపడడానికి గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది.
అధిక ఉప్పు తీసుకోవడం మూత్రపిండాలపై భారం పెంచుతుంది. సోడియం ఎక్కువగా ఉంటే కిడ్నీస్ ఫిల్టర్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమమైన కిడ్నీ డామేజ్ కి లేదా కిడ్నీలో స్టోన్స్ కి దారి తీస్తుంది. అధిక సోడియం శరీరంలో నీటిని నిలువ చేస్తుంది. దీని వల్ల కాళ్లు, చేతులు శరీరంలో ఇతర భాగాలు వాపు ఏర్పడతాయి. అంతేకాక ఇది శరీరం బరువు పెరగటానికి కూడా ఒక కారణం అవుతుంది.రుచి కోసం వాడే ఉప్పు అతిగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, గ్యాస్, జీర్ణ క్రియ సమస్యలు రావచ్చు కొన్ని సందర్భాల్లో గ్యాస్టిక్ అల్సర్స్ కూడా దారితీస్తుంది. అంతేకాక క్యాల్షియం బయటకు వెళ్లేలా చేస్తుంది . ఇది ఎముకల బలహీనతకు దారి తీసి దీర్ఘకాలంగా ఎముక నొప్పి లేదా విరిగే ప్రమాదం పెంచుతుంది.
జాగ్రత్తలు: ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా పై సమస్యల నివారించవచ్చు. అంతేకాక కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం రోజుకు ఐదు గ్రాములు కంటే తక్కువ ఉప్పుని మనం తీసుకోవాలి. చిప్స్, ఫాస్ట్ ఫుడ్, సాస్,కు దూరంగా ఉండాలి. ప్యాకెట్ లో నిలువ చేసిన ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది వాటిని తగ్గించడానికి ప్రయత్నించాలి. తాజా కూరలు, పండ్లు ఇంట్లో వండిన ఆహారాలు ఎక్కువగా తినాలి. ఆహార ప్యాకెట్లపై సోడియం కంటెంట్ ను చెక్ చేసుకొని ఆ తరువాత లేబుల్ని బట్టి ప్యాకేట్ ఎంచుకోవాలి. ఉప్పుకు బదులుగా జీలకర్ర,మిరియాలు, పసుపు, లవంగం వంటి సహజ మసాలాలను ఎక్కువగా ఉపయోగించాలి. శరీరంలో స్టేడియం స్థాయి సమం చేయడానికి తగినంత నీరు తాగాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ సలహాతో ఆహారంలో ఉప్పు మోతాదు నిర్ణయించుకోవచ్చు.
(గమనిక:పైన తెలిపిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే, ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న వెంటనే వైద్యుడిని సంప్రదించండి.)