హైబీపీ తో బాధపడే వాళ్ళు వీటిని తింటే మంచిది..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది హైబీపీ తో బాధపడుతున్నారు. అయితే నిజంగా హైబీపీ తో బాధపడే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, జీవన విధానం సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. అయితే హైబీపీతో బాధపడే వాళ్ళు ఈ పదార్ధాలని డైట్ లో ఫాలో అవ్వండి. వీటిని కనుక మీరు మీ డైట్ లో తీసుకుంటే కచ్చితంగా బీపి కంట్రోల్ లో ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు వాటికోసం ఇప్పుడే చూద్దాం.

 

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడంవల్ల హైబీపీ కంట్రోల్ లో ఉంటుంది. ద్రాక్ష, కమలాలు, నిమ్మ మొదలైన సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్స్, యాంటిఆక్సిడెంట్స్, మినరల్స్ తక్కువగా ఉంటాయి బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలానే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సోడియం అయితే అస్సలు ఉండదు. కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ ని మీరు తీసుకోండి.

గుమ్మడి గింజలు, చియా సీడ్స్, ఫ్లేక్ సీడ్స్:

నిజంగా ఈ గింజలని తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు వీటిలో మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది. అలానే బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

బీన్స్ :

బీన్స్ లో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. బీన్స్ ను తీసుకోవడం వల్ల బీపీ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి హైబీపీ తో బాధపడే వాళ్లు బీన్స్ కూడా తీసుకుంటే మంచిది.

బెర్రీస్:

హృదయ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడానికి బెర్రీస్ బాగా ఉపయోగపడతాయి యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. రాస్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి వాటిలో ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి తప్పకుండా తీసుకుంటే మంచిది.

పాలకూర బ్రోకలీ:

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం మెగ్నీషియం ఉంటాయి. హై బీపీ తో బాధపడే వారికి చాలా బాగా పనిచేస్తాయి. కేవలం డైట్ మాత్రమే కాకుండా యోగా, వాకింగ్ కూడా మీరు రెగ్యులర్ గా చేస్తే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version