ఈ మధ్యకాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు వయసు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వలన వచ్చే సాధారణ సమస్య. అయితే కీళ్ల నొప్పుల నుంచి బయటపడడానికి ఎలాంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. కీళ్ల నొప్పులకు బోన్ సూప్ తాగడం చాలా మంచిది. బోన్ సోప్ తీసుకోవడం వలన చక్కటి పరిష్కారం కనపడుతుందని వైద్యులు అంటున్నారు.
అలాగే కావాల్సిన పోషకాలను అందించడానికి ఇది సహాయం చేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గడానికి ఇది మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. దీనిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి. ఇందులో వుండే అద్భుతమైన గుణాలు వలన కీళ్ల రాపిడి తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి.
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. వెల్లుల్లితో కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే అల్లం, ఆపిల్ సైడర్ వెనిగర్, వాము, పసుపు, ఆలివ్ ఆయిల్ కూడా కీళ్ల నొప్పులు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇలా వీటితో కీళ్ల నొప్పులకు దూరంగా ఉండొచ్చు. అదే విధంగా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికే కాదు. వాపు నివారణకు కూడ తోడ్పడతాయి. కీళ్లవాతం ఉన్నవాళ్లు నొప్పి తగ్గటానికి ఇలా వీటిని ఉపయోగించవచ్చు.