ల్యాబ్ అవసరం లేకుండా ఆహారంలో మైక్రోప్లాస్టిక్‌లను ఎలా గుర్తించాలి..?

-

మైక్రో ప్లాస్టిక్స్ అనేవి చిన్న ప్లాస్టిక్ పదార్థాలు. వీటి వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మైక్రో ప్లాస్టిక్స్ ని ఆహారంలో ఎలా గుర్తించొచ్చు..? దీనికోసం ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. కొన్ని చిన్న టిప్స్ ద్వారా ఆహారంలో మైక్రో ప్లాస్టిక్స్ ని గుర్తించడానికి అవుతుంది.

మైక్రో ప్లాస్టిక్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సినవి:

ఆహార పదార్థాలలో మైక్రోప్లాస్టిక్స్ ని గుర్తించడానికి అసలు అవి ఏంటి..? ఎలా వస్తాయి అనేది తెలుసుకోవాలి. ఇవి కంటికి అస్సలు కనపడవు. ప్రాసెస్డ్ ఫుడ్, బేవరేజెస్ వంటి వాటిలో కూడా ఉంటాయి. అయితే ఇవి కలిసినట్లు ఎలా గుర్తించొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

కళ్ళతో చూడండి:

సన్నని పొరల్లా కనబడతాయి జాగ్రత్తగా ఒకసారి ఈ ఆహార పదార్థాలను గమనించండి. ఒకవేళ కంటికి కనబడితే మీరు వాటిని గుర్తించి వాటిని తీసుకోకుండా ఉండొచ్చు.

భూతద్దంలో చూడండి:

ఒక భూతద్దాన్ని తీసుకుని కూరగాయలు, పళ్ళు వంటి వాటిపై చూడండి. సన్నని మైక్రో ప్లాస్టిక్స్ ని మీరు గుర్తిస్తే వాటిలో ప్లాస్టిక్ కలిసిందని మీరు తెలుసుకొని వాటికి దూరంగా ఉండవచ్చు.

వాటర్ టెస్ట్:

వాటర్ టెస్ట్ ద్వారా కూడా మైక్రో ప్లాస్టిక్స్ ని మీరు గుర్తించొచ్చు. ఒక బౌల్ లో ఆహార పదార్థాలను వేసి నీళ్లు పోయండి. కాసేపు అలా వదిలేసి తర్వాత పైన తేలుతున్న పదార్థాలని గమనించండి. ఒక క్లాత్ సహాయంతో ఫిల్టర్ చేయండి. ఇప్పుడు భూతద్దం పెట్టి చూడండి. మీకు సన్నని రూపంలో మైక్రో ప్లాస్టిక్స్ కనపడొచ్చు. సెడిమెంటేషన్ టెస్ట్, ఫిల్టరేషన్ సిస్టం కూడా ప్లాస్టిక్స్ ని గమనించడానికి సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version