కుక్కర్ లీక్ అవుతోందా..? అయితే వీటిని ఫాలో అవ్వాల్సిందే..!

-

కుక్కర్లో మనం రెగ్యులర్ గా వంట చేసుకుంటూ ఉంటాం. కుక్కర్ల వలన వచ్చే పెద్ద సమస్య ఏంటంటే కుక్కర్ బాగా లీక్ అయిపోతూ ఉంటుంది. కుక్కర్ లీక్ అవ్వడం వలన క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కుక్కర్ లీక్ అవ్వకుండా ఉండడానికి ఇలా చేయండి. కుక్కర్ నుంచి ఏమీ లీక్ అవ్వకూడదు అంటే రబ్బర్ని చెక్ చేయాలి. ఒకవేళ లూజ్ గా ఉన్నట్లయితే లీక్ అయిపోతుంది. చల్లటి నీళ్ళల్లో రబ్బర్ని ఉంచడం లేదా ఫ్రిజ్లో పెట్టడం వలన టైట్ గా మారుతుంది. విజిల్ కండిషన్ ని కూడా చూసుకోవాలి.

విజిల్ లో ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నట్లయితే సరిగ్గా విజిల్ రాదు. దాంతో కుక్కర్ లీక్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఒకసారి విజిల్ ని కూడా మీరు పెట్టేటప్పుడు చెక్ చేయాలి. కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవ్వకుండా ఉండడానికి కుక్కర్ మూతకి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చేయడం వలన లీక్ అవ్వకుండా ఉంటుంది. నెయ్యినైనా రాయచ్చు. లీక్ అవ్వకుండా ఉండడానికి కుక్కర్ ని ఆహార పదార్థాలని వండే ముందు కొంచెం చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన కూడా ఈ సమస్య ఉండదు.

కుక్కర్ కెపాసిటీ మించి ఆహారాన్ని వండడానికి ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే కూడా లీక్ అయిపోతుంది. అల్యూమినియం కుక్కర్లని ఈ రోజుల్లో చాలా మంది వాడుతున్నారు. కానీ అల్యూమినియం కుక్కర్స్ ని ఉపయోగించడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. బదులుగా మీరు స్టీల్ కుక్కర్స్ ఉపయోగించడం మంచిది స్టీల్ కుక్కర్స్ ఉపయోగించడం వలన ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది. ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రెషర్ కుక్కర్స్ లో వండేటప్పుడు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి ఇలా ఈ టిప్స్ ని ఫాలో అయితే కుక్కర్ వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version