చికెన్ ప్రియులకు భారీ షాక్..హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ధరలు

-

చికెన్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. ఉన్నపళంగా చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. మొన్నటివరకు వినాయక చవితి నవరాత్రులు ఉండటంతో తగ్గిన ధరలు.. తాజాగా ఆశాకాన్నంటాయి. గత రెండు వారాల కిందట స్కిన్ లెస్ కిలో రూ.160 నుంచి రూ.180 మధ్య విక్రయించారు. అయితే, గత ఆదివారం నుంచి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

మంగళ, బుధవారం ధరలు ఈ విధంగా పెరుగుతూ వచ్చాయి. విత్ స్కిన్ కేజీ రూ.213, స్కిన్ లెస్ కేజీ రూ.243గా నిర్ణయించారు. ఫామ్ రేటు రూ.125, రిటైల్ రూ.147 చొప్పున అమ్ముతున్నారు. అయితే, మున్ముందు చికెన్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల దసరా పండుగ ఉన్న నేపథ్యంలో కేజీ స్కిన్ లెస్ ధర రూ. 300 కూడా దాటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version