గర్భిణులకు సీజేరియన్ చేస్తే.. తర్వాత ఏమవుతుంది..?

-

బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి స్త్రీకి పునర్జన్మ లాంటిదే. మహిళ గర్భంతో ఉన్నపుడు శరీరాల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. అందుకే కొంతమంది మహిళలకు నార్మల్ డెలివరీ అయితే.. మరికొంతమందికి సిజేరియన్ చేసి బిడ్డకు బయటకు తీస్తారు. సర్జరీ ద్వారా బిడ్డకి జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ సెక్షన్ డెలివరీ అంటారు. ఏ మహిళలకైనా డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లీ, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సీ సెక్షన్ చేస్తారు.

pregnant-lady

అయితే బిడ్డకి జన్మనివ్వడానికి జనన ద్వారం అనువుగా తెరుచుకోకపోవడం జరుగుతుంది. ఇక కవలలు లేదా ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఒకేసారి జన్మించడం, తల్లీకి హైబీపీ ఉండడం బిడ్డ పొజిషన్ నార్మల్ డెలివరీకి అనువుగా లేకపోవడం, బేబీ హార్ట్ పెరిగిపోవడం, బేబీ తల పెద్దదిగా ఉండడం, బ్లీడింగ్ మరీ ఎక్కువగా అవ్వడం, బిడ్డ బొడ్డు తాడు కట్ అయిపోవడం, తల్లికి డయాబెటీస్, బీపీ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం లాంటి సమస్యలుంటే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయడం జరుగుతుంది.

ఇక తప్పని సరి పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తే, నార్మల్ డెలివరీ కంటే కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. సిజేరియన్ డెలివరీ తర్వాత నొప్పి ఉంటుంది. సర్జరీ తరువాత తల్లి కోలుకోవడానికి రెండు నుంచి ఆరు వారాల వరకూ పడుతుంది. ఈ టైంలో డాక్టర్లు సూచించిన పెయిన్ కిల్లర్స్ వాడాల్సి ఉంటుంది. నడవడం ద్వారా ఇది మొదలు పెట్టడం మంచిది. సర్జరీ కొరకు కోత పెట్టిన ప్రదేశాన్ని వెచ్చటి, సోప్ వాటర్‌తో ఆ ప్రదేశాన్ని క్లీన్ చేసి మెత్తని బట్టతో తుడుచుకోవాలి. సీ సెక్షన్ నుండి కోలుకోవడానికి మీకు తగినంత సమయం కావాలి. ఆరు వారాల వరకూ శరీరానికి విశ్రాంతినివ్వడం ద్వారా పూర్తిగా కోలుకోవచ్చు. రోజుకి ఏడెనిమిది గంటల నిద్ర చాలా అవసరం.

అంతేకాదు సీ సెక్షన్ తర్వాత చాలా మంది కాన్స్టిపేషన్ సమస్యని ఎదుర్కొంటారు. ఈ సమస్యకి పరిష్కారం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ని డైట్ లో భాగం చేసుకోవాలి. సీ సెక్షన్ నుంచి కోలుకోవడానికి న్యూట్రిషస్ ఫుడ్ ఎంతో అవసరం. విటమిన్ సీ ఎక్కువ ఉండే ఫుడ్స్ వల్ల టిష్యూ రిపెయిర్ జరుగుతుంది. అలాగే, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ వల్ల బ్లడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. నీరు అందుబాటులో పెట్టుకుని కొద్ది కొద్దిగా రోజంతా తాగుతూ ఉండడం మంచిది. ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి అని రూల్ పెట్టుకోవాలి. ఫ్రూట్ జ్యూసులు మోతాదులోనే తీసుకోవాలి. కాఫీ, సోడాలు వంటిని అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేస్తే చాలా తొందరగా కోలుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version