బ్రోకొలి చూడటానికి క్యాలీఫ్లవర్ లాగా కనిపించే అందమైన పువ్వు కూర బ్రోకొలి. దీనిని అత్యంత ఆరోగ్యవంతమైన వెజిటేబుల్ గా చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంకా కాదు.బ్రొకొలి అనేక పోషక తత్వాలతో పాటు విటమిన్ బి5,సి, ఇ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్,శక్తివంతమైన న్యూట్రీషియన్స్ ను కలిగి ఉంటుంది.బ్రొకొలి ఒక నేచురల్ డిటాక్స్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది మన జీర్ణ వ్యవస్థను అనగా పేగులు, పొట్టను శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియలను పెంపొందిస్తుంది. ఉదర ఆరోగ్యాన్ని పెంచి, మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
బ్రొకొలి అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ను పుష్కలంగా కలిగి ఉంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరటినాయిడ్స్ , టూటిన్, బీటా కెరటిన్ వంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వలన శరీరంలో ఏర్పడే టాక్సిన్లు మరియు ఫ్రీరాడికల్స్ సులభంగా తొలగించబడతాయి. బ్రొకొలిలో ఇతర కూరగాయల్లో కంటే ఎక్కువగా క్యాల్షియంను కలిగి ఉంది.ఇది ఎముకలను బలోపేతం చేయడానికి మరియు ఎముకలను ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఇది వయసు పైబడటం వలన ఎముకలు పెలుసుగా మరియు బలహీనంగా మారే లక్షణాలను తగ్గిస్తుంది.
క్యాన్సర్ కారకాలతో పోరాడే అత్యుత్తమ ఆహార పదార్థాల్లో బ్రొకొలి ఒకటి. శరీరానికి అవసరమయ్యే ఎంజైములకు రక్షణ కల్పిస్తుంది. అలాగే క్యాన్సర్ కు కారణం అయ్యే కెమికల్స్ ను శరీరం బయటికు విసర్జించడంలో మనకు సహాయపడుతుంది.అలాగే బ్రొకొలి మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట అద్భుత వరంగా చెప్పవచ్చు . బ్లడ్ లోని షుగర్ ను క్రమబద్ధం చేసే టాప్ ఫుడ్ లో బ్రొకొలి ఒకటి.ఇది చక్కెర మరియు చక్కెరతో చేసే పదార్థాలను తినాలని కోరికను చాలా తగ్గించడమే కాకుండా రక్తంలోని చక్కర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి తప్పని పరిస్థితిలో వారానికి ఒక్కసారైనా బ్రోకోలిని మీ ఆహారంలో ఒక భాగం చేసుకుంటే ఎటువంటి రోగాలనైనా సరే దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగుండాలి అంటే ఈ ఆహారం మీ భోజనంలో ఉండాల్సిందే.