బాలింతలకు పాలు పట్టాలన్నా, ఓవరీస్ లో బుడగలు పోవాలన్నా శతావరి పౌడర్ వాడితే చాలట..!

-

కొన్ని రకాల సమస్యలను కొన్ని ఔషధాలు ప్రకృతి ప్రసాదించినవి వాడి తగ్గించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నాచురల్గా సమస్యను తగ్గించుకోవాలని చాలామంది అనుకుంటారు..కానీ అవి ఎలానో తెలియక ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోతుంటారు. ఈరోజు మనం ఒక సమస్యను నాచురల్గా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం..అదే శతావారి. ..దీన్నే పిల్లితీగలు అంటారు.

శతావరి వల్ల కలిగే లాభాలు:
బాలితంతలు బాగా పాలురావడానికి అద్భుతంగా శతావరి పనిచేస్తుంది.
ఈ శతావరి పౌడర్ యాంటీ డిప్రసెంట్ గా మానసికంగా డిప్రషన్ కు గురైన వాళ్లు మందులు వాడుతుంటారు. అలాంటివారు..మందులు వాడకుండా…ఈ శతావరి పౌడర్ అలాంటివారికి చాలా బాగా పనిచేస్తుంది.
కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి రాళ్లు కరగడానికి, యూరిన్ బాగా ఫ్రీగా అవడానికి ఉపయోగపడుతుంది.
పొట్టలో అల్సర్స్ మానటానికి, జిగురు ఉత్పత్తి పెంచి, యాసిడ్ ఉత్పత్తి పెంచి, డైజెషన్ స్టెబులైజ్ చేయడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
ఇక ఆఖరిది ఆడవారికి పిరియడ్స్ ఇరెగ్యులర్ గా రాకుండా సెట్ చేయడానికి, ఓవరీస్ లో నీటిబుడగలు రాకుండా ఉండటానికి పనిచేస్తుంది.

ఈ ఐదు ప్రధానమైన లాభాలు ఉన్నాయని ఒక్కోదాన్ని ఒక్కో యానివర్సిటీ పరిశోధన చేసి ఇచ్చారు. ఈ శతావరి పౌడర్ ను ఉదయం పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు పాలల్లో కలిపి బాలింతలు తీసుకుంటే..వారి వక్షోజాల్లో పాల ఉత్పత్తికి కారణమయ్యే అల్వియోలర్ టిష్యూని ( Alveolar Tissue) బాగా సైజ్ పెంచి ప్రొలాక్టిన్ హార్మోన్( Prolactin) ఎక్కువగా ఉత్పత్తి అయ్యేట్లు చేసి ఎక్కువ మొత్తంలో పాలు వచ్చేట్లు చేస్తుంది. ఈరోజుల్లో బాలింతలు నాలుగు నెలలు కూడా పాలు ఇవ్వలేకపోతున్నారు. బిడ్డలకు దంతాలన్నీ వచ్చేవరకూ పాలు ఇవ్వాలి. మీకు పాలు రాలేదంటే..మీ బిడ్డకు మీరు అన్యాయం చేస్తున్నట్లే..బిడ్డకు రెండు, రెండున్నర సంవత్సరాల పాటు బిడ్డకు పాలివ్వాలంటే..పూర్వం రోజుల్లో చాలా చేసే‌వాళ్లు. ఇప్పుడు అవన్నీ చెప్పేవాళ్లు లేరు..అందుబాటులో ఉన్న శతావరి పౌడర్ ను వాడుకుంటే చాలు. దీని ధర 100 గ్రాములు తీసుకుంటే.. 70 రూపాయిలు ఉంటుంది. ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుగుతుంది.

వివిధ కారణాల వల్ల డిప్రషన్ కు గురవతున్నారు. యాంటీ డిప్రసెంట్ మందులు బాగా ఉపయోగించటం వల్ల మత్తుగా ఉంటుంది, బరువు పెరుగుతారు, బాడీలో మెటబాలిజంలో అనేక మార్పులు వస్తాయి. ఈ డిప్రషన్ నాచురల్గా తగ్గడానికి ఈ శతావరి పౌడర్ బాగా ఉపయోగపడుతుంది..ఈ పౌడర్ తీసుకోవటం వల్ల మనకు సెరటోనిన్ ( Serotonin) అనే హార్మోన్ ప్రొడెక్షన్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఇది హ్యాపీ హార్మోన్. ఇది పెరగటం వల్ల మూడ్ స్వింగ్స్ లేకుండా చేసి..మానసిక ప్రశాంతను చేకూర్చడానికి ఇది పనిచేస్తుంది.

2005వ సంవత్సరంలో కెఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ- తమిళనాడు( KM Colleage Of Pharmacy- Tamilnadu) వారు ఈ శతావరి మీద పరిశోధన చేశారు. ఈ పౌడర్ ను ఉపయోగించటం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. కొంత మంది యూరిన్ సమస్య ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ కరిగి త్వరగా బయటకు వెళ్లేట్లు చేస్తుందని అధ్యయనంలో నిరూపించారు

2005వ సంవత్సరంలో మోహన్ లాల్ సుకాడియా యూనివర్శిటీ- ఉదయ్ పూర్( Mohan lal Sukhadia University- Udaipur) వారు పరిశోధన చేసి..ఈ శతావరి పౌడర్ పొట్టలో అల్సర్స్ ను తగ్గించడానికి, ఆ భాగంలో కణజాలం ఉత్పత్తి అయి లేయర్ ఫామ్ అవడానికి బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. పొట్ట అంచుల వెమ్మట జిగురు ఉత్పత్తి పెంచి..హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యేదాన్ని కంట్రోల్ చేయడానికి ఈ శతావరి పనికొస్తుందని ఎలుకలపై పరిశోధన చేసి నిరూపించారు.

ఈరోజుల్లో ఆడపిల్లలను ఇబ్బందిపెట్టే ఓవరీస్ లో నీటిబుడగలు, ఇరెగ్యులర్ పీరియడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల పెళ్లైనా పిల్లలు కలగటం లేదు. ఇలాంటి వారికి శతావరి అద్భుతంగా పనిచేస్తుందని 2018వ సంవత్సరంలో బెనారస్ హిందూ యూనివర్శిటీ( Banaras Hindu University- Varanasi)వారు పరిశోధన చేసి కనుగొన్నారు.

ఇలాంటి సమస్యలు తగ్గించుకోవాలనుకునే వారు..ఈ శతావరి పౌడర్ తెచ్చుకుని పాలల్లో లేదా వేడి నీళ్లలో తేనె కలుపుకుని ఉదయం పది గ్రాములు, సాయంత్రం పది గ్రాములు కలుపుకుని తాగాలని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version