కీరాదోసకాయే కదా అని లైట్ తీసుకుంటున్నారా..? ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..!

-

మార్కెట్ లో ఎప్పుడు అందుబాటులో ఉండే వెజిటబుల్ లో కీరాదోసకాయ ఒకటి..ఇది కళ్లకు మంచిదని అని మాత్రం అందరికి తెలుసు..దీన్ని తెచ్చుకుని కూడా చాలామంది..బ్యూటిటిప్స్ లో వాడుతారే కానీ..అంతకుమించి కీరాదోసకాయను పెద్దగా వాడరు. ఈరోజు మనం ఈ కీరాదోసకాయతో ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది చూద్దాం.

వెజిటబుల్స్ అన్నింటికంటే..అతి తక్కువ శక్తిని ఇచ్చి ఎక్కువ నీటి శాతాన్ని ఇచ్చే నెంబర్ వన్ వెజిటబుల్ కీరాదోసకాయ..100 గ్రాముల కీరాదోసకాయలో నీరు 96శాతం ఉంటుంది. శక్తి 10 కాలరీలు. కేజీ తిన్నా ఏం కాదు..పొట్టనిండుతుంది కానీ బరువు పెరగరు. షుగర్ పెరగదు.

కీరాదోసకాయను ఎలా ఉపయోగించుకోవచ్చు?

వేడిచేసినప్పుడు కీరాదోసకాయ చక్రాలు కళ్లమీద పెట్టుకుంటారు..సలాడ్స్ లో పెట్టుకుంటారు. ఇది చాలా మంచిదే..ఇంకా ఎలా వాడుకోవచ్చు అంటే..కీరాదోసకాయను తొక్క తీయకుండా ముక్కలుగా కట్ చేసి కప్పు పేరుగులో వేసి, అందులో ఒక ఉల్లిపాయ ముక్కలు వేయండి..కొత్తిమీర, నిమ్మరసం కూడా వేసుకుంటే ఉల్లి చట్నీ అవుతుంది..దీన్ని నంచుకుంటూ..భోజనంలో ఉప్పులేకుండా తినేప్పుడు ఇది వాడుకోవచ్చు.

కీరదోసకాయను ఎ‌వరూ కూర వండుకోరు కానీ..తొక్కతీయకుండా దోసకాయ వండుకున్నట్లు వండుకోవచ్చు. కీరాదోసకాయను వెజిటబుల్ జూస్ లో వాటర్ వేయకుండా వాడుకోవచ్చు. క్యారెట్, టమోటా, బీట్ రూట్ జ్యూసులు చేసుకునేప్పుడు అందరూ ముందు నీళ్లు పోసి గ్రైండ్ చేస్తారు..కానీ ముందు కీరాదోసకాయ వేస్తే..నీళ్లలా అయిపోతాయి..

అన్ని సలాడ్స్ లో కీరాదోసకాయ తురిమి వేసుకుంటే..ఉప్పువేయక్కర్లేదు, కాలరీస్ రావు. ఇలా ఏ రకంగా అయినా కీరాదోసకాయను ఉపయోగించుకోవచ్చు.

కీరదోసకాయ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి?

ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆహారం అరిగినతర్వాత కూడా అందులో ఉండే వాటర్ కంటెంట్..ప్రేగుల్లో మలపదార్థంగా వెళ్లేప్పుడు డ్రై అవకుండా..మెత్తగా డెజెషన్ అవడానకి ఉపయోగపడతాయి.

కీరాదోసకాయలో ఉండే ఫ్లైవనాయిడ్స్, టానిన్స్ వల్ల కణజాలం పైపొర డామేజ్ అవకుండా కాపాడుతుంది. పైపొర డామేజ్ అయితే..క్రిములు లోపలికి వెళ్లిపోతాయి, కణజాలం ఆయర్ధాయం తగ్గిపోతుంది. ఎలాఅయితే..కూరగాయకు తొక్కతీసేసి ఉంచితే..ఎలా పాడైపోతుందో అలా. కణాల లైఫ్ కూడా కవచం మీద ఆధారపడి ఉంది. కవచం డామేజ్ అవకుండా కాపలా కాసే..ఫైవనాయిడ్స్, టానిన్స్ కీరాదోసకాయలో ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి బాడీలో సెల్స్ కి, పైన ఉండే లేయర్ కు చాలా రక్షణ కల్పిస్తుంది.

ఉందులో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ బాగా ఉండటంతో..ఆహారంలో వచ్చిన చెక్కరపదార్థాలను రక్తంలోపలకి త్వరగా వెళ్లకుండా..మెల్లగా వెళ్లేట్లు చేస్తుంది. అలాగే ప్యాంకిరాస్ గ్రంధిలో ఉండే బీటాకణాలను రిలాక్స్ చేసి..ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేట్లు చేస్తుందని పరిశోధనలో నిరూపించారు.

కీరాదోసకాయలో ఉండే కుకుంపటాసిన్ బీ అనేది ప్యాంక్రియాస్ క్యాన్సర్ రాకుండా 50శాతం కంట్రోల్ చేస్తుందని..మెక్సికో దేశం వారు సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు.

ఇది స్కిన్ లూస్ కాకుండా..స్కిన్ సెల్స్ టైట్ గా ఉండి ముసలితనం త్వరగా రాకుండా చేస్తుందట. పిగ్మెంటేషన్ తగ్గించి, స్కిన్ గ్లో పెరగటానికి బాగా ఉపయోగపడుతుందట. పైన కీరాదోసకాయ ముక్కలు పెట్టుకున్నా, రుద్దుకున్నా పేషియల్ స్కిన్ కు బాగా హెల్ప్ చేస్తుందట.

ఇన్ని లాభాలు ఉన్నాయి..పైగా తక్కువ ధరకే వచ్చేస్తుంది కాబట్టి..అందరూ వాడుకునేందుకు ప్రయత్నంచమని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version