వర్షాకాలం దాదాపుగా మూడు నెలల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఈ మూడు నెలలు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఆరోగ్యంగా ఉండలేరు. వర్షాకాలంలో నిరోధక శక్తి తగ్గిపోవడం.. తరచూ జబ్బుల బారిన పడ్డం లాంటి ఏదో ఒక సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరి ముఖ్యంగా మనలో రోగనిరోధక శక్తి పెంపొందించే డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్ కూడా ఒకటి. వాల్ నట్స్ లో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ కొంతమంది వాటి టేస్ట్ నచ్చక తినడం మానేస్తూ ఉంటారు. అయితే వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరని చెప్పాలి. ప్రతిరోజు రెండు లేదా మూడు వాల్నట్స్ తినమని వైద్యులు సైతం చెబుతున్నారు. ఇక వాల్నట్ తినడానికి వయసుతో సంబంధం లేదు. ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా తినాలని చెబుతున్నారు. అయితే వాల్ నట్స్ యొక్క పూర్తి ప్రయోజనాలు లభించాలి అంటే వాటిని ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టి తింటే 100% పోషకాలు మన శరీరానికి లభిస్తాయి.
ఇక ఇందులో ఉండే పోషకాలు విషయానికి వస్తే..యాంటీ ఆక్సిడెంట్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉండడం వల్ల గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక వీటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్ కడుపు నిండిన భావాలను కలిగిస్తాయి. కాబట్టి బరువు త్వరగా తగ్గవచ్చు. ఇక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు డయాబెటిస్ ఉన్నవారు కూడా నిర్మొహమాటంగా వీటిని తినవచ్చు. ఇక డిప్రెషన్, అల్జీమర్స్ , ఒత్తిడి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి ఇక వాల్నట్స్లో మెలటోనిన్ ఉండడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంతవరకు నీటిలో నానబెట్టి వీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి .అప్పుడే ఈ వర్షాకాలంలో రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.