ఆ నలుగురు..నా గడ్డంలో వెంట్రుక కూడా పీకలేరు – కొడాలి నాని

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏబీఎన్ రాధాకృష్ణ, టివి5 నాయుడు, రామోజీరావు ఈ నలుగురు… తన గడ్డంలో ఉన్న వెంట్రుక కూడా పీకలేరని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురు సీఎం జగన్ పై… అసత్య ప్రచారాలు అలాగే ఆరోపణలు చేస్తూ… పంబము గడుపుతున్నారని నిప్పులు చెరిగారు.

నిన్న ప్లీనరీ సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూర్యుడు లాంటి వాడని పేర్కొన్నారు. ఓట్ల కోసం భార్యను బజారుకు ఇడ్చిన 420 చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తే తల్లి పాత్ర పోతుందా ? తల్లిని మించిన హోదా ఉంటుందా ? అని కొడాలి నాని ప్రశ్నించారు.

దుష్ట చతుష్టయం పర్మినెంట్ గా పిచ్చాసుపత్రిలో చేరబోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని.. పుట్టి పెరిగిన చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడైనా గెలిచాడా అని నిలదీశారు కొడాలి నాని. దేశంలో చంద్రబాబు లాంటి చెమట దద్దమ్మ ఎక్కడా లేరని చురకలంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version