తలనొప్పి తీవ్రంగా బాధిస్తోందా ? అయితే ఇలా చేయాల్సిందే..!

-

ప్రస్తుతం ఉన్న కాలం లో మన జీవనశైలి మార్పుల వలన అనేక అనారోగ్య ఇబ్బందులను ఎదురుకుంటున్నాం. అందులో ఒకటి తలనొప్పి. ఇది ఎందుకు వస్తుందంటే సరిగ్గా నిద్ర లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం, అన్నింటికి టెన్షన్ పడిపోవడం..అలానే ఎక్కువగా మొబైల్స్ , టీవీ, ల్యాప్ ట్యాప్ వంటివి చూడడం వల్ల ఇది ఎక్కువగా వస్తుంది. ఇలా తలనొప్పి వచ్చినప్పుడు దాని నుంచి ఉపశమనం మరియు శాశ్వత పరిష్కారం ఎలా పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే మాత్రలు వేసుకుంటాం. అలా ప్రతి సారి టాబ్లెట్స్ వాడడం వలన అప్పటికి అప్పుడే ఉపశమనం పొందవచ్చు. కానీ శాశ్వత పరిష్కారం పొందలేము. అలా టాబ్లెట్స్ వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా మనం సహజ పద్ధతిలో తలనొప్పిని ఎలా తగ్గించుకొనవచ్చునో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తలనొప్పి కి శాశ్వత పరిష్కార నియమాలు :
ప్రతిరోజు మనం రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లను త్రాగడం వలన శాశ్వతంగా తలనొప్పి రాకుండా నివారించవచ్చు. ఇలా నీరుని త్రాగడం వలన మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ టాయిలెట్స్ రూపంలో బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల మనకి తలనొప్పి వచ్చే అవకాశం ఉండదు.

మెగ్నీషియం లోపం ఉన్నవారిలో తరచూ మైగ్రేన్, తలనొప్పి ఎక్కువగా వస్తుంది. మీ డైట్ లో ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయలు, నట్స్,చిరుధాన్యాలు , డార్క్ చాక్లెట్స్ ఎక్కువగా తీసుకోండి.

ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

గోరు వెచ్చని పాలు త్రాగిన , అల్లాన్ని నమిలినా తలనొప్పి తగ్గుతుంది.

మీ ఇంట్లో గంధం పౌడర్ ఉంటే పేస్ట్ లా చేసుకుని తలకు రాసుకోండి.

తలనొప్పి ఎక్కువగా ఉంటే వెలుగు తక్కువగా ఉండే ప్రాంతంలో రెస్ట్ తీసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎంతటి తలనొప్పైనా సరే పోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version