ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవన విధానం, తీసుకునే ఆహారం సరిగా ఉండేటట్టు చూసుకోవాలి అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఏదైనా ఆహార పదార్ధాలతో మరొక ఆహార పదార్థం తీసుకుంటూ ఉంటాము. వీటి వల్ల ఆరోగ్యం పాడైపోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజు మనం ఏయే ఆహార పదార్ధాలు (Foods) కలిపి తీసుకోకూడదు అనేది చూద్దాం.
మనం ఏదైనా ఒక ఆహార పదార్ధాన్ని ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉందని దీని మీద మేము చాలా రీసర్చ్ చేసాము అని నిపుణులు చెప్పారు. కొన్ని కొన్ని సార్లు కొన్ని ఇలా కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు.
90 శాతం మంది పిజ్జా తినడానికి ఇష్టపడతారు. అది కూడా ఏదైనా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుని పిజ్జా తింటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పిజ్జా లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, స్టార్చ్ ఎక్కువగా ఉంటాయి.
ఇవి అరగడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి. మరొక వైపు మీరు ఏదైనా షుగర్ తో కూడిన సోడా డ్రింక్ తీసుకుంటే కడుపులో అస్సలు ఎనర్జీ ఉండదు. దీని కారణంగా డైజేషన్ మరింత ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ తీసుకోకుండా ఉండటం మంచిది.
అదే విధంగా చాలా మంది మఫిన్స్ మరియు జ్యూస్ కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే మఫిన్స్ తియ్యగా ఉంటాయి అయితే ఇవి అసలు సెట్ అవ్వవు. దానిలో షుగర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అలానే జ్యూస్ లో కూడా పంచదార, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఒంట్లో షుగర్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి కాబట్టి రెండింటినీ కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు.
అలానే పాస్తా లో టమాటాలు వేసుకుని తీసుకుంటాము. పాస్తా లో స్టార్చ్ ఎలిమెంట్ ఉంటుంది ఇది జీర్ణ సమస్య తీసుకొస్తుంది. అలానే టమాటాల్లో కూడా యాసిడిక్ కంటెంట్ ఉంటుంది ఇలా బ్లోటింగ్ వంటి సమస్యలకు దారి తీస్తాయి.
అదే విధంగా మనం ఆహారం తీసుకునే సమయంలో జ్యూస్ కానీ నీళ్లు కానీ తాగుతూ ఉంటాము చాలా మందికి ఇది ఒక హ్యాబిట్ అని చెప్పవచ్చు.
అయితే ఆహారం తీసుకోవడంతో పాటు వీటిని తాగడం వల్ల డైజెస్టివ్ జ్యుసులు డైల్యూట్ అయిపోతాయి. దీని కారణంగా జీర్ణ సమస్యలు వస్తాయి కాబట్టి ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు ఈ కాంబినేషన్స్ ని తీసుకోవద్దు దీని వల్ల సమస్యలు వస్తాయి.