తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఆందోళన కూడా కావొచ్చు..!

-

మహిళలకు చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయి. పిరియడ్స్ పెయిన్స్.. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ , ఆందోళన, డిప్రెషన్, మూత్రాశయానకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 26 విభిన్న అధ్యయనాలలో మహిళలు యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని తేలింది. మూత్రాశయం, డిప్రెషన్ మధ్య సంబంధం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

ఆందోళనపై చేసిన 6 అధ్యయనాలలో.. స్త్రీలు ఆందోళన ఉన్నప్పుడు కూడా మూత్రాశయం ఓవర్ యాక్టివ్‌గా మారుతుందని దాని వల్ల మళ్లీ మళ్లీ మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఉందని తేల్చారు. తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చి మందులు వాడుతూ ఉంటే, అది కొంత వరకు తగ్గినా మళ్లీ మళ్లీ సమస్య వస్తూనే ఉంటుంది. దానికి కారణం మీ మానసిక ఆరోగ్యం బాలేకపోవడమే..చాలా ఒత్తిడికి లోనవుతున్నారా లేదా ఆందోళన కారణంగా మీ తలపై భారం పడుతుందా అనేది గమనించండి.

యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య రాకుండా ఉండాలంటే..

  • ఎక్కువ నీరు తీసుకోవాలి. టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండండి.
  • డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించి, మానసికంగా దృఢంగా మారొచ్చు.
  • ఏకాంతంలో గడపడం, ధ్యానం చేయాలి. ధ్యానం మానసికంగా దృఢంగా మారడానికి చాలా సహాయపడుతుంది.
  • జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా.. ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.

వాటర్ ఎక్కువగా తాగకపోవడమే.. యూటీఐకు ప్రధానం.. బాడీకీ సరిపడా నీళ్లు ఇవ్వకపోవడం వల్ల డీహైడ్రేట్‌గా మారి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడంతో ఈ వ్యాధి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొందరు యూరిన్ కు ఎక్కువ సేపు ఆపుకుంటారు. వివిధకారణాల వల్ల ఇలా చేస్తుంటారు.. కానీ తరచూ ఇలా టాయిలెట్ హోల్డ్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి.

వందలో 50 మంది మహిళలకు యూటీఐ సమస్యతో నేడు బాధపడుతున్నారు.. కానీ విచిత్రమేంటంటే.. వీరి ఈ సమస్య ఉందని ముందు గుర్తించలేకపోతున్నారు. మహిళలకు ఆందోళన ఎక్కువగా ఉంటుంది. హైజనిక్ గా ఉన్నప్పటికీ.. మనసు ప్రశాంతంగా లేక ఎప్పుడూ ఏదో ఆందోళనలో ఉండటం కూడా యూటీఐకు కారణం అని అధ్యయనాలు చెప్తున్నాయి.. కాబట్టి.. ఈ సమస్య ఉన్నవారు.. వీలైనంత వరకూ ప్రశాంతంగా, హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version