నోటి దుర్వాసన అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి ఎన్ని పరిష్కార మార్గాలు చూసినా సరే ఫలితాలు మాత్రం ఉండవు. బ్రష్ నీట్ గా చేస్తే ఏమీ ఉండదు అని కొందరు చెప్తూ ఉంటారు. అలా కాదు… ఫుడ్ లో మార్పులు చెయ్యాలి అంటారు మరికొంత మంది. అయితే నోటి దుర్వాసన పోవాలి అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలని అంటున్నారు నిపుణులు.
ఇది ఎదుటి వారికి చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో లవంగాలు వేసుకుని నములుతూ ఉంటే సమస్య క్రమంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా యాలకులు తిన్నాసమస్య క్రమంగా పరిష్కారమవుతుంది. కాబట్టి నోటి దుర్వాసనతో బాధపడేవారు ఈ చిట్కాలను పాటించడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గిపోతుందని సూచిస్తున్నారు.
ఇక కంటి సంస్యస్యలకు కూడా మరో చిట్కా ఉంది. ఎక్కువసేపు సిస్టమ్ వర్క్స్ చేసినా, డ్రైవింగ్ చేసినా, నిద్రలేకపోయినా ఇలా ఎన్నో కారణాల వల్ల కంటి సమస్యలు వస్తాయి. కళ్ళల్లో మంట రావడం, నీళ్ళు రావడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి సమస్య ఉన్న వారికి తులసి చాలా బాగా పని చేస్తుంది. తులసి ఆకులు.. ప్రతి రోజూ ఉదయాన్నే రెండు తులసి ఆకులని తీసుకోవడం వల్ల కంటి సమస్యలు చాలా వరకూ దూరమవుతాయని సూచిస్తున్నారు.