గర్భిణీలు వీటిని తప్పక డైట్ లో తీసుకోవాలి..!

-

గర్భిణీలు భవిష్యత్తులో ఏ సమస్య రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల మీరు మీ బిడ్డ కూడా క్షేమంగా ఉంటుంది. అయితే గర్భిణీలు తమ యొక్క డైట్ లో ఈ విధమైన ఆహార పదార్థాలను తప్పక తీసుకోవాలి.

 

ఫోలిక్ యాసిడ్:

బి విటమిన్ అనేది పిల్లలకి చాలా అవసరం. మీకు జన్మించే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా విటమిన్ బి ని మీరు తీసుకోవాలి. పుట్టబోయే బిడ్డలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇది చూసుకుంటుంది. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ని తీసుకొచ్చు లేదు అంటే ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్ లో ఇది ఉంటుంది వీటిని అయినా తీసుకోవచ్చు.

ఐరన్:

ఐరన్ కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. ఐరన్ తక్కువగా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రిమెచూర్ లేబర్, హై బ్లడ్ ప్రెషర్, పుట్టబోయే బిడ్డ చిన్నగా పుట్టడం, డెలివరీ సమయంలో బ్లడ్ లాస్ ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ఐరన్ సప్లిమెంట్స్ ని కూడా తీసుకోవాలి. లేదంటే ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు,
నట్స్, బీన్స్, డ్రై ఫ్రూట్స్, విటమిన్ సి తీసుకోవడం వల్ల ఐరన్ బాగా అందుతుంది. కాబట్టి ఐరన్ కూడా తప్పకుండా డైట్లో తీసుకోండి.

క్యాల్షియం:

ఇది కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎముకల్ని దృఢంగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. డైరీ పదార్థాల్లో కాల్షియం మనకి ఎక్కువగా దొరుకుతుంది. పాలు, పెరుగు, పనీర్ మొదలైనవి తీసుకొచ్చు. అలాగే ఆకుకూరలు, కాయగూరలులో కూడా ఇది ఉంటుంది.

విటమిన్ డి:

విటమిన్ డి నరాలు, మజిల్స్ మరియు రీప్రొడక్టివ్ సిస్టం కి చాలా అవసరం. సూర్య కిరణాల ద్వారా మనం పొందొచ్చు లేదు అంటే మనం సప్లిమెంట్స్ ని అయినా తీసుకోవచ్చు.

అయోడిన్:

ఇది ని కూడా చాలా ముఖ్యం. మనం ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఉప్పు లో ఎక్కువ ఉంటుంది. చేప, డైరీ ప్రొడక్ట్స్, ఫోర్టిఫైడ్ బ్రెడ్ వంటి వాటిలో కూడా ఉంటుంది.

ప్రోటీన్:

ప్రోటీన్ కూడా చాలా ముఖ్యం. గుడ్లు, చేప, చికెన్ వంటివాటిలో ఇది మనకి దొరుకుతుంది అలానే బీన్స్, గింజలు, బఠానీ వంటివాటి ద్వారా మనం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version