బరువు తగ్గాలనుకున్న వాళ్లకి రోటి, పరాటాలో ఏది మంచిది..?

-

చాలా మందిలో ఈ అనుమానం ఉంటుంది. బరువు తగ్గడానికి రోటి, పరాటాలో ఏది మంచిది అని తికమక పడుతూ ఉంటారు. అయితే ఈ రోజు మనం రోటీ, పరాటాలో బరువు (Weight)తగ్గడానికి ఏది మంచిది అని తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దాని కోసమే పూర్తిగా చూసేయండి.

బరువు /Weight

రోటి, పరాటా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.అయితే బాగా ఆకలేసినప్పుడు కొంత మంది రోటీని ప్రిఫర్ చేస్తారు. మరి కొందరు పరాటాని ప్రిఫర్ చేస్తారు. అయితే బరువు తగ్గడానికి ఈ రెండిట్లో ఏది మంచిది అని డాక్టర్ ఈరోజు చెప్పారు.

అయితే మనం ఏం తీసుకున్నాం అనేది కాదు తీసుకునే కేలరీలు బట్టి మన బరువు ఉంటుంది గమనించండి. ఎక్కువ క్యాలరీలు ఉండే పరాటాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గే వాళ్లకి ఇబ్బందిగా ఉంటుంది. అదే తక్కువ కేలరీలు వుండే రోటి తీసుకుంటే బరువు తగ్గడానికి ఈజీగా ఉంటుంది.

ఒక ఆరు ఇంచుల గోధుమ పరాటా లో 15 గ్రాములు కార్బోహైడ్రేట్, మూడు గ్రాముల ప్రోటీన్, 70 కేలరీలు ఉంటాయి. అదే ఆరు ఇంచుల పరాటా లో అయితే 126 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఏది మంచిదో మీరే ఆలోచించండి. పరాటా తినేటప్పుడు ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే పోషక పదార్థాలు అందుతాయి.

డయాబెటిస్ తో బాధపడే వాళ్లు పరాటాని తినకూడదు. నెయ్యి తో చేసినది, కాల్చిన వాటిని డయాబెటిస్ పేషెంట్లు తినడం మంచిది కాదు. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు రోటి తినడం మంచిది. అది కూడా నెయ్యి లేకుండా తీసుకోవాలి.

ఇది ఇలా ఉంటే రోటిని ఆరోగ్యంగా కూడా చేసుకోవచ్చు. జొన్నలు, రాగులు, బాదం, ఓట్స్ మొదలైన వాటితో మీరు రోటీ లేదా పరోటా చేసుకొని తినవచ్చు ఇదైతే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version