పొట్టి వారికి ఆ వ్యాధి ముప్పు ఎక్కువ‌..!

-

పొట్టి వారు గ‌ట్టి వారు అన్న సామెత వినే ఉంటారు. కానీ ఈ విష‌యంలో మాత్రం ఆ సామెత‌కు భిన్నంగా ఉంది. సాధార‌ణంగా పొడవైన వ్యక్తులతో పోలిస్తే పొట్టిగా ఉన్న వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంద‌ని యూరప్ నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం సూచిస్తుంది. పరిశోధకులు జర్మనీలో వేలాది మంది వ్యక్తుల నుండి శారీరక పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకున్న సమాచారాన్ని ఇటీవ‌ల విశ్లేషించారు. వారి పరిశోధనలో పొట్టివారికి డయాబెటిస్ 2 వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు వారి పరిశోధనలో తేలింది.

పొట్టిగా ఉన్న వారిలో లివర్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటమే మధుమేహం, గుండె జబ్బులు రావడానికి కారణమని జర్మన్ పరిశోధకులు తేల్చారు. పొడుగు వారితో పోలిస్తే పొట్టి వారిలో లివర్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడమే ఈ జబ్బులకు కారణమవుతోందని పరిశోధకులు తెలిపారు. జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ నూట్రీషన్ శాస్త్రవేత్తలు  దాదాపు 2500 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడిందని వెల్ల‌డించారు.

ఒక వ్యక్తి ఎత్తులో ప్రతి 4-అంగుళాల పెరుగుదల పురుషులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 41% ఉంటే..  మహిళలకు 33% ఉన్న‌ట్లు పరిశోధకులు కనుగొన్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని ప్రభావితం చేసే కారకాలు, వయస్సు, నడుము చుట్టుకొలత, శారీరక శ్రమ స్థాయిలు, ధూమపాన అలవాట్లు మరియు మద్యపానం వంటి అంశాలను  పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ విష‌యాన్ని క‌నుగొన్నారు ప‌రిశోధ‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version