గుర‌క వ్యాధికి చెక్ పెట్టే సింపుల్ చిట్కాలు

-

స‌హ‌జంగా చాలా మంది వ్యక్తులు నిద్రలో గురక పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. వీరి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పుకోవడం వింటూనే ఉంటాం. గుర‌క వ‌ల్ల చాలామందికి స‌రిగా కంటిమీద కునుకు ఉండ‌దు. వాస్త‌వానికి గురక పెట్టేవారికన్నా ఎక్కువ  పక్కనున్నవారిని ఇబ్బంది పెడుతుంది. కొన్ని గురకలు విసుగు పుట్టిస్తే.. మరికొన్ని గురకలతో భయం పుడుతుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే దీనికి కొన్ని టిప్స్ పాటిస్తే గురక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


–  తేనెలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలను కలిపి తీసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల గుర‌క స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

– వెల్లకిలా కాకుండా ఏదైనా ఒక వైపుకు తిరిగి పడుకుంటే గురక రాదు. అంతేకాకుండా తలవైపు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా గురక రాకుండా ఆప‌తుంది.

– ప్రతి రోజూ రాత్రి నిద్రపోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్‌ అవుతుంది.

– ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా యాలకుల పొడి కలిపి నిద్ర పోయే ముందు తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గురక సమస్య త‌గ్గుతుంది.

– తేనెలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల‌ మంచి ఫలితం కనిపిస్తుంది.

–  రాత్రి పూట భోజనంలో పచ్చి ఉల్లిపాయను తినాలి. దీంట్లో ఉండే సల్ఫర్ యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీంతో గురక సమస్య త‌గ్గుతుంది.

– గోరువెచ్చని పాలలో ప‌సుపును వేసుకొని తాగడం వల్ల శ్వాసనాళాలను శుభ్రం చేస్తుంది. దీంతో గుర‌క స‌మ‌స్య త‌గ్గుతంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version