ఒకప్పుడు గురక సమస్య పెద్దొళ్లకే వచ్చేది. రానురాను కాస్త యంగ్ యేజ్ వాళ్లకు కూడా వస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం అలసట అంటాడరు. కానీ ఇప్పుడు ఏడాదిలోపు పిల్లలు కూడా గురకతీస్తున్నారు. కొందిరికైతే ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించటం లేదు. ఈ సమస్యపై అప్రమత్తం కావాల్సిందే అంటున్నారు చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణలు. అసలు ఈ గురక సమస్యను లారింగోమలాసియా అంటారట.
ఈ సమస్య సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఏడాదిలోపు చిన్నారుల్లో కనిపిస్తుంది. చిన్నారులు తీవ్రమైన గురకతో బాధపడడం, డొక్కలు ఎగరేయడం వంటి లక్షణాలు ఉంటాయి.
2,100 మందిలో ఒకరికి సమస్య..
ప్రతి 2,100 మంది చిన్నారుల్లో ఒకరికి ఈ సమస్య వస్తుంది. నర్సీపట్నం ప్రాంతంలో 120 మంది చిన్నారులు ఈ తరహా సమస్యతో వచ్చినప్పుడు వారికి పరీక్షలు నిర్వహించగా… 48 మంది లారింగోమలాసియాతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ స్థాయిలో బాధితులు వుండడం కొంత ఆందోళన కలిగించే అంశంగా డాక్టర్లు చెబుతున్నారు.
సమస్యకు మూలం
మనం పీల్చే గాలి లోపలకు వెళ్లాలంటే ముక్కు నుంచి ఒక ప్రధాన ద్వారం ఉంటుంది. ఈ ద్వారం మొదటి భాగాన్ని లారిన్స్ అంటారు. దీన్ని ప్రధాన గేటుగా చెప్పవచ్చు. అక్కడి నుంచే మాట కూడా వస్తుంది. దీన్ని వాయిస్ బాక్స్ అంటారు. ఇది చాలా పలుచగా ఉంటుంది. అయితే ఈ లారింగోమలాసియా సమస్యతో బాధపడే చిన్నారుల్లో వాయిస్ బాక్స్ మరింత పలుచగా ఉంటుందట. ఊపిరి తీసుకున్నప్పుడు ఒత్తిడికి గురై లోపలకు వెళ్లిపోతుంది. అలా లోనికి వెళ్లిన వాయిస్ బాక్స్ బయటకు గాలి వదిలినప్పుడు అడ్డుపడుతుంది. దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఏర్పడి చిన్నారులు మరణించే ప్రమాదం ఉంది. దీన్ని సడన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్ గా పేర్కొంటారు. కొందరు చిన్నారుల్లో ఈ సమస్య వల్ల ఎదుగుదల ఉండదు.
లక్షణాలు
ప్రధానంగా ఈ సమస్యకు గురక, డొక్కలు ఎగరేయడం, మందులు వాడినా జలుబు తగ్గకపోవడం, ఎక్కిళ్లు రావడం, వాంతులు అవుతుండడం వంటివి దీని లక్షణాలు. ఈ సమస్య ఎనిమిదో నెల వచ్చేంత వరకు పెరుగుతుంటుందట.
సర్వేలో ఏం తేలిందంటే..!
సర్వేలో వారు వాడిన మందులు, ఎప్పుడు గర్భం దాల్చినదీ, ఎప్పుడు పెళ్లి జరిగిందన్న విషయాలపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా లెరింగో మలేసియాతో బాధపడుతున్న చిన్నారుల తల్లులు 18 నుంచి 19 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకున్నట్టుగా గుర్తించారు. అదేవిధంగా 20 ఏళ్లలోపు గర్భం దాల్చినట్టుగా తేలింది. మొదటి, రెండో బిడ్డకు మధ్య గ్యాప్ లేకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం, గర్భిణిగా వున్న సమయంలో రక్తహీనతతో బాధపడిన వాళ్లకు పుట్టిన చిన్నారుల్లో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు.
పరిష్కారం
ఓరల్ కాల్షియం డ్రాప్స్ ఇవ్వడం ద్వారా చిన్నారులు ఈ సమస్య నుంచి రికవరీ అవుతారట. 16 రోజుల చిన్నారి తీవ్రమైన గురకతో వచ్చినప్పుడు ఎండోస్కోపీ చేయగా… మొదటిసారి లారింగోమలాసియా సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. అనంతరం పరిశోధన ప్రారంభించారు. సదరు చిన్నారికి మెరుగైన మందులు ఇవ్వడం వల్ల ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మీ చిన్నారుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యలను సంప్రదించటం మంచింది.