Rajinikanth : నాకే వాడు అడ్డు రా అంటూ వచ్చేసిన “పెద్దన్న”

-

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా ను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుoడగా… సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కుష్బూ, మీనా మరియు యంగ్ హీరో కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.అయితే ఈ సినిమా తెలుగులో “పెద్దన్న” పేరుతో విడుదల అవుతోంది.

దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది పెద్దన్న. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ పెద్దన్న టీజర్ ను విడుదల చేశారు. రజనీకాంత్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. రజినీకాంత్ లుక్స్ మరియు నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ” ఉప్పెన రా… వాడికి అడ్డులేదు.. ఒడ్డు లేదు” అనే డైలాగ్ అందరినీ అలరించింది. ఇక తాజాగా విడుదలైన ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version