వేసవి స్పెషల్: సబ్జా తో కూల్ కూల్…!

-

వేసవిలో సబ్జా తో ఇలా చేసుకొని తీసుకుంటే ఎన్నో లాభాలు పొందొచ్చు. సబ్జా తీసుకోవడం వల్ల చలవ చేస్తుంది. నిజంగా దీనిని సమ్మర్ సూపర్ ఫుడ్ అనొచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.

మీకు కావాలంటే గ్లాసు నీళ్లలో నానబెట్టుకుని సబ్జాని తిన్నవచ్చు లేదు అంటే పెరుగు, బట్టర్ మిల్క్ లో నానబెట్టుకుని తీసుకోవచ్చు. లేదా షర్బత్, మిల్క్ షేక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న దీని వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే కాస్త విభిన్నంగా సమ్మర్ స్పెషల్ సబ్జా శికాంజీ షర్బత్ ఎలా చేయాలో చూద్దాం వీటిని తీసుకుంటే చల్లగా ఉంటుంది పైగా ప్రయోజనాలు కూడా ఎక్కువే.

సబ్జా శికాంజీ షర్బత్ కి కావాల్సిన పదార్థాలు:

క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్
పంచదార
సాల్ట్
నిమ్మరసం
జీలకర్ర పొడి
బ్లాక్ సాల్ట్
నీళ్లలో నాన పెట్టుకున్న సబ్జా గింజలు
కొద్దిగా మజ్జిగ

సబ్జా శికాంజీ షర్బత్ ని తయారు చేసే విధానం:

దీనికోసం ఐస్ క్యూబ్స్, పంచదార, ఉప్పు, నిమ్మరసం, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, నానబెట్టుకున్న సబ్జా గింజలు మంచి నీళ్లు వేసి మిక్స్ చేయండి. ఆ తర్వాత మజ్జిగని కూడా వేసి మళ్లీ కలపండి ఇప్పుడు దీనిని గ్లాస్ లో వేసుకుని తీసుకోండి అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version