పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా…6 వికెట్లు డౌన్‌ !

-

Aus vs Ind: BGT 2024 సీజన్ లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియ, భారత్ మధ్య ఐదో టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ఇక లంచ్‌ బ్రేక్‌ తర్వాత కూడా మరో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ప్రస్తుతం క్రీజ్ లో వెబ్ స్టర్ 47 పరుగులతో రాణిస్తున్నారు.

India vs Australia LIVE Score, 5th Test, Day 2

అలెక్స్ కేరీ 21 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. భారత్ బౌలింగ్ అదుర్స్ అనిపించింది. బుమ్రా 2, సిరాజ్ 2, ప్రసిధ్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్సింగ్స్ లో భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక అటు రిటైర్మెంట్‌ పై రోహిత్‌ సంచలన ప్రకటన చేశారు. నేను పిచ్చోన్ని కాదంటూ రిటైర్మెంట్ పై రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. నేను రిటైర్ అవ్వ లేదని…. ఐదవ టెస్ట్ నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చారు. టీం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఫాంలో లేనని కోచ్ గంభీర్‌కి చెప్పానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version