ఈ 4 రోజూ తీసుకోండి.. మానసిక సమస్యలేమీ వుండవు..!

-

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే ఒత్తిడి మొదలైన ఇబ్బందుల వలన చాలామంది మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి ఈ ఆహార పదార్థాలతో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటే వీటిని తీసుకోండి.

ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి ఆకుకూరలని కనుక తీసుకున్నట్లయితే మానసిక సమస్యలు దూరమవుతాయి. పైగా పోషకాలు బాగా అంది శారీరకంగా కూడా ఎన్నో ప్రయోజనాలని పొందవచ్చు. మెంతికూర తోటకూర పాలకూర మొదలైన ఆకుకూరలు తీసుకుంటూ ఉండండి. పండ్లు బెర్రీస్ ని తీసుకుంటే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

తాజా పండ్లు బెర్రీస్ వంటి వాటిని తీసుకోండి అప్పుడు మానసిక ఆరోగ్య మెరుగుపడుతుంది డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తగ్గుతాయి. చేపలలో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి చేపలను తీసుకుంటే మెదడులో రక్తప్రసరణ బాగా అవుతుంది పైగా జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. నట్స్ ని కూడా తీసుకుంటూ ఉండండి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వాల్నట్స్ బాదం వంటి వాటిని తీసుకోండి. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి ఇలా వీటి ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version