జామపండు అనేక పోషకాలను కలిగి ఉన్న పండు. జామ ఆకులలో అనేక పోషకాలు ఉండటమే కాకుండా అనేక వ్యాధులకు ఈ ఆకులు ఔషధంలా పని చేస్తాయి. జామ టీలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే అన్ని పోషకాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. జామపండులో విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జామ టీలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే అన్ని పోషకాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
జామలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ ఫినోలిక్ సమ్మేళనాలు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. జామలోని మైకోలైటిక్ లక్షణాలు ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం తొలగించి దగ్గు నుండి ఉపశమనం పొందుతాయి. జామపండులో లైకోపీన్ మరియు క్వెర్సెటిన్ వంటి అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది మరియు గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం బీపీని అదుపులో ఉంచుతుంది. జామ పండు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక పండులో 38 కేలరీలు మాత్రమే ఉంటాయి.
జామ ఆకు టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. మరొకటి ఏమిటంటే, జామ ఆకులు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని అరికట్టడంలో సహాయపడతాయి. విరేచనాలు పోవాలంటే జామ ఆకులతో మరిగించిన టీ తాగడం మంచిది. జీర్ణకోశ సమస్యలను తగ్గించడంలో జామ టీ కూడా మంచిది. జామ ఆకుల్లో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లను కలిగి ఉండే జామ ఆకులు పంటి నొప్పి, చిగురువాపు మరియు నోటి పూతల నుండి బయటపడటానికి సహాయపడతాయి.