సమ్మర్‌లో శరీరాన్ని చల్లబరిచేందుకు ఈ పండ్లు తప్పక తినాలి

-

సమ్మర్‌ సీజన్ మొదలైపోయింది. బయట ఎండలు మండిపోతున్నాయి.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు..మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటే చుక్కలే.. రాత్రుళ్లు కూడా ఉక్కపోత అలానే ఉంది. ఈ సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.. తగినన్ని నీళ్లు తాగాలి.. లేదంటే డీహైడ్రేషన్‌ బారిన పడతారు. వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. తినే ఆహారం ద్వారానే బాడీని కూల్‌ చేసుకోవాలి.. మరీ ప్రత్యేకించి ఈ ఎండాకాలం తినాల్సిన ఆహారాలు ఏంటో చూద్దామా..!

ఈ జాబితాలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంది. 92% వరకు వాటర్ కంటెంట్ ఉన్న పుచ్చకాయ వేసవిలో తినడానికి చాలా మంచిది. పుచ్చకాయ వేడి వేసవిలో దాహాన్ని తీరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

ఈ జాబితాలో స్ట్రాబెర్రీలు రెండవ స్థానంలో ఉన్నాయి. స్ట్రాబెర్రీలలో 91% వరకు నీరు ఉంటుంది. వాటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి వేసవిలో తినడానికి కూడా మంచి పండ్లు.

జాబితాలో ఆరెంజ్ తర్వాతి స్థానంలో ఉంది. నారింజలో 87% వరకు నీరు ఉంటుంది. అలాగే, విటమిన్ సి ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న నారింజ తినడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ జాబితాలో నాల్గవ స్థానం పైనాపిల్ ఉంది. పైనాపిల్‌లో 86% వరకు నీరు ఉంటుంది. వాటిలో విటమిన్ సి కూడా ఉంటుంది.

ఈ జాబితాలో పీచెస్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. వాటిలో 89% వరకు నీరు ఉంటుంది. పీచులో విటమిన్ ఏ, సీ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

ఇక ద్రాక్షలో కూడా 80% వరకు నీరు ఉంటుంది. కాబట్టి సమ్మర్‌లో వీటిని కూడా తినొచ్చు. వీటితో పాటు వాటర్‌ కంటెంట్ ఎక్కువగా ఉన్న కూరగాయలు తినడం అలవాటు చేసుకోండి.. పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, ఆకుకూరలు ఎక్కువగా తినాలి.. మసాలు వంటలు, నాన్‌వెజ్‌, ఆయిలీ ఫుడ్స్‌ను తగ్గించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version