ఈ తప్పుల వలనే మహిళల్లో హృదయ సంబంధిత సమస్యలు వస్తున్నాయి…!

-

ఈ మధ్యకాలంలో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువైపోయాయి. అయితే మహిళలతో పోల్చుకుంటే పురుషుల్లో ఎక్కువగా హృదయ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మహిళల్లో కూడా 20 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆరోగ్యపరంగా ఈ తప్పులు చేయడం వల్ల గుండె సమస్యలు మహిళల్లో వస్తాయి. అయితే మరి మహిళలు ఎలాంటి తప్పులు చేయకూడదు..?, ఎలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి చూద్దాం.

స్మోకింగ్:

మహిళలు కూడా స్మోకింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలలో, పల్లెటూర్లలో స్మోకింగ్ ఎక్కువగా మహిళలు చేస్తూ ఉంటారు. స్మోకింగ్ వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హార్ట్ ఎటాక్ కూడా స్మోకింగ్ కారణంగా రావచ్చు. కాబట్టి మహిళలు స్మోకింగ్ చేయకుండా ఉంటే మంచిది.

వ్యాయామం:

మహిళలకి చాలా పనులు ఉంటాయి. ఆఫీస్ పనులు ఇంటి పనులు ఇలా చాలా చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ పనుల్లో పడిపోయి వ్యాయామం చేయకపోవడం మంచిది కాదు. ఏదో ఒక సమయాన్ని చూసుకుని వ్యాయామం చేస్తే మంచిది.

బరువును కంట్రోల్లో ఉంచుకోండి:

ఈమధ్యకాలంలో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఒబిసిటీ కూడా ఉంటోంది. వీటివల్ల కూడా హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక బరువు లేకుండా చూసుకోండి.

నిద్ర మరియు ఒత్తిడి:

ఎక్కువ సేపు నిద్ర పోవడం చాలా ముఖ్యం. కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. హృదయ సంబంధిత సమస్యలు దీనివల్ల రాకుండా ఉంటాయి. అలాగే ఒత్తిడి కూడా లేకుండా ఉండడం చాలా ముఖ్యం.

రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోండి:

డయాబెటిస్, హైపర్ టెన్షన్ మొదలైన సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఇలా ఈ విధంగా మహిళలు జాగ్రత్తలు తీసుకు ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే ఇబ్బందిలేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version