ఈ లక్షణాలు చిన్నవి కావొచ్చు.. కానీ లైట్‌ తీసుకుంటే మనమే పోవచ్చు.!

-

రోజూ యాక్టివ్‌గా ఉండే దోస్తుగాడు ఒక్కసారిగా డల్‌ అయ్యాడంటే.. కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. లైట్‌ తీసుకుంటే..వాడి బాధ పంచుకునే వాడు ఎవరూ ఉండరూ. తనలో తనే మదన పడతాడు.. అలాగే..శరీరంలో ఎప్పుడూ జరగంది ఈ మధ్య జరుగుతుంటే.. పర్లేదు పెద్దగా నొప్పి, ఇబ్బంది లేదు కదా అని లైట్‌ తీసుకుంటే.. లోపల జరగాల్సిన నష్టం జరుగుతూ వస్తుంది. లక్షణాలు రోగాలకు సంకేతాలు.. వాటిని కనిపెట్టినప్పుడే ముప్పు నుంచి బయటపడగలం. ఈ మధ్య ఎందుకో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అనిపిస్తుందా..? అలా అనిపిస్తే.. కాస్త లావైనట్లు ఉన్నా అందుకే ఏమో అని లైట్ తీసుకోకండి. ఇలాంటి కొన్ని లక్షాలకు ఎదురయ్యే సమస్యలేంటో చూద్దాం.!

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే చాలా మంది పిచ్చ లైట్‌ తీసకుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. ధమనులు మూసుకుపోవడం వల్ల అసాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ధమణిలో రక్తం ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయి. అటువంటి సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. అది నిర్లక్ష్యం చేస్తే గుండె పోటు సంభవించే ప్రమాదం ఉంది. ఛాతీ నొప్పి మాత్రమే గుండె పోటుకి సంకేతం కాదు. మైకం, ఛాతిలో బిగుతుగా అనిపించి శ్వాస ఆడకపోవడం కూడా ప్రమాదమే.

రక్త స్రావం

మహిళల్లో మెనోపాజ్ తరువాత కూడా జననాంగాల నుంచి రక్తస్రావం జరిగితే… అది ఆందోళన కలిగించే అంశమే.. సెక్స్ తర్వాత రక్తస్రావం అనేది కూడా ప్రమాద సూచనే. అది అలాగే కొనసాగితే స్త్రీ జననేంద్రియాల క్యాన్సర్‌కి సంకేతంగా మారవచ్చు. అందుకే అలా కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యులని కలిసి టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.

మలబద్ధకం

సాధారణంగా మలబద్ధకాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మలవిసర్జన సమయంలో అధిక ఒత్తిడి ఉపయోగించాల్సి వస్తే అది హెమరాయిడ్స్‌కి కారణం కావచ్చు. దీన్నే పైల్స్ సమస్య అంటారు. అప్పుడప్పుడు మలబద్ధకం సాధారణం కూడా కావచ్చు. కణితి లేదా పాలిప్ వంటి అడ్డంకి ఫలితంగా కూడా మలబద్ధకం ఏర్పడవచ్చు. దాని వల్ల మలం సరిగా కదలకుండా చేస్తుంది. మలబద్ధకం సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. పొద్దున లేవగానే వాటర్‌ ఎక్కువగా తాగితే సమస్య ఉండదు.

రొమ్ము వాపు

ఇది రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ సాంకేతాల్లో ఒకటి. రొమ్ము గడ్డగా మారిపోవడం రంగు మారడం, సైజు చిన్నది కావడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు. రొమ్ములు ఉబ్బుగా వాసినట్లు మీకు అనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి.

విషయం చిన్నదే అయినా విషం చిమ్మక ముందే వైద్యులను సంప్రదిస్తే.. సమస్య ఏంటో చెప్తారు. చాలామంది చిన్న సమస్యకు లేనిపోని టెస్టులు చేసి పైసలు వసూలు చేస్తారు అని హాస్పటల్స్‌కు వెళ్లరు. ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు కదా..? స్లోపాయిజన్‌లా జబ్బు బాడీని దహించకముందే కాస్త డబ్బు ఎక్కువైనా పర్వాలేదు అసలు సమస్య ఏంటో తెలుకోవడంలో తప్పులేదేమో.!

Read more RELATED
Recommended to you

Exit mobile version