గుండె ఆరోగ్యానికి చిన్న చిన్న చిట్కాలు…!

-

సాధారణంగా ఎటువంటి సంకేతము లేకుండా వచ్చేవి హార్ట్ ఎటాక్స్. 50 శాతం గుండె జబ్బులు అనుకోకుండా వచ్చేవే . గుండెలో ఒక భాగానికి రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల గుండె జబ్బు వస్తుంది. అయితే ఈ గుండె జబ్బులు రాకుండా నివారించడానికి ఆరోగ్యకర అలవాట్ల ను అలవరచుకోవాలి. వీటి వల్ల ఎక్కువ శాతం ముప్పు నుండి తప్పించుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని రక్షించు కోవడానికి అయిదు ఆరోగ్యకర అలవాట్లు నేర్చుకోవాలి.

హెల్డి డైట్, రోజు 40 నిమిషాల పాటు వాకింగ్, వారానికి గంట సేపు వ్యాయం చేయాలి, నడుము చుట్టుకొలత 95 సెంటిమీటర్ దాటకుండా జాగ్రత్త పడాలి, మందు, పొగ తాగడం వంటి అలవాట్లను మానేయాలి. గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే బయటి ఫుడ్ తగ్గించాలి. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ఎక్కువగా పచ్చివి,ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే తినాలి.

ఎక్కువగా పండ్లు, కూరగాయలు,మాంసం వంటివి తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు తినే వారికి ఎలాంటి అనారోగ్యము దరిచేరదు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గుండె సమస్యను దూరం చేయడానికి రోజులో ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోకూడదు. వీలైనప్పుడల్లా చెప్పులు లేకుండా నడవాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా నడవడమే కాక ఒత్తిడిని దూరం చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version