నెలసరి సమయంలో మహిళలు వీటిని తీసుకుంటే మంచిది..!

-

నెలసరి సమయంలో ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తలనొప్పి, కడుపు నొప్పి, నీరసం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ ఇలా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయితే అటువంటి సమయంలో మహిళలు ఈ విధంగా పాటిస్తే ఖచ్చితంగా సమస్యల నుంచి బయట పడవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా నెలసరి సమయంలో మహిళలు పాటించాల్సిన చిట్కాలు గురించి చూద్దాం.

ఎక్కువ నీళ్లు తాగాలి:

ఎక్కువ నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. అలానే హైడ్రేట్ గా ఉండచ్చు. చెడు మలినాలను తొలగిస్తుంది కూడా. గోరువెచ్చని నీళ్లు తాగితే మరింత మంచిది.

పుదీనా టీ:

పుదీనా టీ కూడా చాలా మంచిది. కడుపు నొప్పి, క్రామ్ప్స్, వికారం, గ్యాస్ వంటి సమస్యలను తొలగిస్తుంది.

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు:

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలానే అనీమియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకోసం తోటకూర, అరటి పండ్లు, గుమ్మడికాయ, బీట్రూట్ వంటివి తీసుకోవాలి.

ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు:

నెలసరి సమయంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, ఫ్రూట్స్ మొదలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలానే క్యాల్షియం లోపం లేకుండా కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ విధంగా మహిళలు నెలసరి సమయంలో తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version